
రాయ్‌పూర్ : కబడ్డీ పోటీలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. ఈ విషాద ఘటన చత్తీస్‌గడ్‌లోని ధమ్తారి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..జిల్లాలోని కోకాడి గ్రామంలో నివసించే 20 ఏళ్ల నరేంద్ర సాహు అనే యువకుడు స్థానికంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆటలో కూతకు వెళ్లిన అతడిని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఒడిసిపట్టుకొని కింద పడేశారు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను మ్యాచ్ వీకక్షిస్తున్న ప్రేక్షకుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. (వైరల్: పిచ్చెక్కినట్లుగా కొట్టుకున్న పులులు)
హుటాహుటిన ఇతర ఆటగాళ్లు సాహుని ఆసుపత్రికి తరలించగా,అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాధమిక దర్యాప్తులో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారి రామ్‌నరేష్ సెంగర్ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 12మందికి పైగా వాంగ్మాలాలను నమోదు చేసినట్లు చెప్పారు. (సీరం బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం: ఐదుగురు మృతి )
Comments
Please login to add a commentAdd a comment