
కంగనా రనౌత్
ముంబైలో జరగనన్న కబడ్డీ మ్యాచ్‌కి వచ్చారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. వచ్చింది గెస్ట్‌గా కాదు. ప్లేయర్‌గా. కంగనా కథానాయికగా ‘బరేలీకి బర్ఫీ’ ఫేమ్ అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారామె. పాత్ర కోసం కంగనా కాస్త బరువు పెరిగారు. ఈ సినిమా ముంబైషెడ్యూల్ శుక్రవారం మొదలైంది.
ఈ షెడ్యూల్ పదిహేను రోజులు సాగుతుంది. ‘‘స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కూడా నేను అథ్లెటిక్ పర్సన్‌ని కాదు. కానీ నాకు కబడ్డీ ఆట తెలుసు. కబడ్డీ ప్లేయర్స్ ఎలా ఉంటారు? వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అనే విషయాలపై నాకు అవగాహన ఉంది. దర్శకుడు అశ్వనీ కోరుకున్నట్లుగా నేనీ సినిమా కోసం మారాను. నా నటన పట్ల ఆమె సంతృప్తిగా ఉన్నారు. అది నాకు హ్యాపీ’’ అన్నారు కంగనా రనౌత్. ‘పంగా’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment