Kangana Ranaut Now Writes Fan Letter To John Abraham - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: సినీ స్టార్స్ వాళ్లను చాలా చీప్‌గా చూస్తారు.. కానీ ఆయన మాత్రం!

Published Mon, Aug 14 2023 4:29 PM | Last Updated on Mon, Aug 14 2023 5:57 PM

Kangana Ranaut now writes fan letter to John Abraham - Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. సినీ ఇండస్ట్రీలో కొంతమంది తనపై కావాలనే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతంలో తనపై గూఢచర్యం చేశారంటూ ఆరోపించింది. ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌ను ఉద్దేశించి కాంట్రవర్సీ కామెంట్స్‌ చేసింది. అయితే తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో తొలిసారి ఓ హీరోను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్‌లో నెగెటివ్ పీపుల్ గురించి విన్నా.. కానీ ఓ మంచి వ్యక్తి కూడా ఉన్నాడని ప్రస్తావించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో నోట్ రాసుకొచ్చింది. ఇంతకీ ఆ గొప్ప మనసున్న హీరో ఎవరో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: 'చిరంజీవి ఇబ్బంది పెడుతున్నారా?'.. వైరలవుతోన్న భోళాశంకర్ నిర్మాత వాట్సాప్ చాట్!)
  

కంగనా రాస్తూ.. 'సినిమా పరిశ్రమలో నేను నెగెటివ్ వ్యక్తుల గురించి నేను చాలా మాట్లాడా. కానీ స్ఫూర్తిదాయకమైన వారిని మాత్రం ఎప్పటికీ మరచిపోకూడదు. నేను జాన్‌ అబ్రహంతో కలిసి పనిచేశాను. అతను ఎంత మంచివారో చెప్పడానికి నా వద్ద మాటల్లేవ్. ఈ విషయం చాలా మందికి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే అతన్ని పొగిడేందుకు తాను ఎవరికీ డబ్బులు ఇవ్వడు.' అని అన్నారు.

జాన్ గురించి చెబుతూ.. 'అతను చాలా దయగల వ్యక్తి.  వివాహం కాలేదు. ఎవరితోనూ రిలేషన్‌లో లేరు. ఇతరుల గురించి నెగెటివ్‌గా మాట్లాడరు. మహిళలను వేధించడం, వారి నుంచి ఎలాంటి ప్రయోజనం పొందడం లాంటి పనులు చేయలేదు. జాన్ కేవలం ఓ అద్భుతమైన మనిషి. అతను కేవలం 'సెల్ఫ్ మేడ్ మ్యాన్' మాత్రమే కాదు.. అన్ని విధాలుగా విజయవంతమైన వ్యక్తి' అని కంగనా ప్రశంసించింది.

జాన్ గురించి ఇంకా రాస్తూ..' "బాంద్రా  ఏరియాలో నివసించే సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికీ.. ఇంట్లో పనివాళ్లను తీసుకొచ్చేఒక ఏజెంట్ ఇలా ఉన్నాడు. అతను ఒకసారి మా మేనేజర్‌తో మాట్లాడారు. హౌస్ హెల్ప్, డ్రైవర్లను చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు చాలా చీప్‌గా, చెడుగా చూస్తారు. అతని కెరీర్ మొత్తంలో పరిశ్రమలోని ఇద్దరు వ్యక్తులే మాత్రమే మంచివారని చెప్పారు. వారి ఇంట్లో పనివాళ్లను సొంత కుటుంబంలా చూసుకుంటారు. వారిలో మొదటి వ్యక్తి జాన్ అబ్రహం, రెండు కంగనా రనౌత్ అని చెప్పాడంటూ. ' పోస్ట్ చేసింది. 

కాగా.. కంగనా జాన్‌తో కలిసి ఓ సినిమాలో నటించింది.  షూటౌట్ ఎట్ వాడాలా (2013)లో జాన్‌ సరసన కనిపించింది. సంజయ్ గుప్తా  దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రంలో అనిల్ కపూర్, తుషార్ కపూర్, మనోజ్ బాజ్‌పేయి, సోనూ సూద్ కూడా నటించారు. ఇది 2007లో షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం మే 3, 2013న విడుదల కాగా..మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 

(ఇది చదవండి: సర్జరీ చేయించుకోనున్న యంగ్ రెబల్ స్టార్.. కారణం అదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement