అందుకే నా బంగ్లాను అమ్మేశా: కంగనా రనౌత్‌ | Kangana Ranaut Reveals Why She Was Forced To Sell Her Bungalow | Sakshi

ఫైనాన్షియల్‌ ‘ఎమర్జెన్సీ’.. బంగ్లాను అమ్మక తప్పలేదు : కంగనా రనౌత్‌

Sep 17 2024 3:47 PM | Updated on Sep 17 2024 4:27 PM

Kangana Ranaut Reveals Why She Was Forced To Sell Her Bungalow

బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పలు కారణాల వల్ల ఆమె నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమెర్జెన్సీ’ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రం కోసం ఆమె తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టింది. అయితే విడుదల వాయిదా పడడంతో డబ్బు కోసం తను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ఆమె స్పందిస్తూ.. బంగ్లాను అమ్మిన మాట నిజమేనని, ఎందుకు అమ్మాల్సి వచ్చిందో కూడా వివరించింది.

(చదవండి: 'జాన్వీకపూర్‌ను చూస్తే ఆమెనే గుర్తొచ్చింది'.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్!)

‘నాకు తెలిసి ఆస్తులు అంటే మనకు అవసరం అయినప్పుడు ఆదుకునేవే. నేను దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా పడింది. నా దగ్గరు ఉన్న డబ్బంతా ఈ సినిమాపై పెట్టాను. విడుదల అయితే తప్ప నాకు డబ్బు రాదు. అందుకే నేను ఇష్టంగా కొనుగోలు చేసిన బంగ్లాను అమ్మేశాను’ అని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా అమ్మిన బంగ్లా.. ముంబైలో ఉన్న బాంద్రాలోని పాలిహిల్‌ పాత్రంలో ఉంది. 2017లో ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. తాజాగా రూ. 32 కోట్లకు ఈ బంగ్లాను విక్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

(చదవండి: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)

ఇక ఎమర్జెన్సీ విషయానికొస్తే..  ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సింది. అయితే సెన్సార్‌ సర్టిఫికేట్‌ రాకపోవడంతో చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ని ప్రకటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement