
రోడ్డుపై గుంతల్లోని నీటిలో కబడ్డీ ఆడుతున్న కార్యకర్తలు
హన్మకొండ చౌరస్తా: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఏబీవీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ మేరకు హన్మకొండలోని జిల్లా బస్టాండ్ వద్ద రోడ్డుపై గుంతల్లో నిలిచిన వర్షపు నీటిలో నాట్లు వేయడంతో పాటు ఆ నీటిలో కాసేపు కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పున్నం వేణుతో పాటు భరత్‌వీర్, అజయ్, వంశీకృష్ణ, అఖిల్, బలరాం, అరుణ్‌సాయి పాల్గొన్నారు
ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు..
వరంగల్ క్రైం: హన్మకొండ బస్టాండ్ వద్ద రోడ్డు మరమ్మతు చేయాలనే డిమాండ్‌తో నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు హన్మకొండ ఇన్‌స్పెక్టర్ దయాకర్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కరోనా నిబంధనలకు ఉల్లంగించినందుకు పున్నం వేణు, ఎర్రగోల్ల భరత్, గాజు అజయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు
వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment