బైక్ రేసుల జోరు | Bike races up | Sakshi
Sakshi News home page

బైక్ రేసుల జోరు

Published Mon, Sep 22 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

బైక్ రేసుల జోరు

బైక్ రేసుల జోరు

మంగళగిరి
 మండలంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్లు, చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డు బైక్ రేసులకు అడ్డాగా మారాయి. శని,ఆదివారాల్లో కొందరు యువకులు ఖరీదైన బైకులతో ఈ ప్రాంతాల్లో ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ అతివేగంగా తిరుగుతూ స్థానికులను హడలెత్తిస్తున్నారు. రేసుల్లో విజయవాడకు చెందిన బడాబాబుల, రాజకీయ పార్టీల నేతల కుమారులు పాల్గొంటున్నారు. రేసుల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన బైకులను వినియోగిస్తున్నారు.
 ్ధ    బైక్ రేసులను కేవలం సరదా కోసమే కాకుండా డబ్బు సంపాదనకు మార్గంగా ఎంచుకోవటం విస్మయం కలిగిస్తోంది. రేసులపై లక్షలాది రూపాయల మేర పందాలు సాగుతున్నారుు. వీటిని పోలీసులు సీరియస్‌గా తీసుకోవటం లేదు. సమాచారం అందినపుడు తూతూమంత్రంగా స్పందించి చేతులు దులుపుకుంటున్నారు. రేసులకు పాల్పడుతున్నది బడాబాబుల పిల్లలు కావటంతో ఒత్తిళ్లకు తలొగ్గి హెచ్చరికలతో వదిలేస్తున్నారు. ఎలాంటి కేసులూ నమోదు చేయటం లేదు.
 ్ధ    మంగళగిరి పరిసరాల్లో బైక్ రేస్‌లు నిర్వహిస్తూ యువకులు ఈ నెలలో ఇప్పటివరకు మూడుసార్లు పోలీసులకు పట్టుబడ్డారు. అరుుతే అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారిని వదిలేశారు. తాజాగా ఆదివారం ఉదయం కాజ టోల్‌గేట్ వద్ద బైక్ రేసులో పాల్గొనేందుకు వచ్చి రూరల్ పోలీసులకు పట్టుబడినవారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్ధ ఉన్నారు. అరుుతే ఎమ్మెల్యే ఒత్తిడితో రేసు కోసం వచ్చిన మరో ఏడుగురు యువకులను, ఐదు బైకులను పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలివేయడం గమనార్హం.
 ్ధ    రేస్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవటం ఖాయం. దీనివల్ల ఆయూ కుటుంబాలవారికి తీరని విషాదమే మిగులుతుంది. అలాంటిదేదైనా జరిగితే తామే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రేసుల్లో పాల్గొంటున్న యువకులు ఇంజినీరింగ్‌లాంటి ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నవారే కావడం విశేషం.
 వేగం, ఫీట్లపై పందాలు.. బైక్ రేసుల్లో పాల్గొనే యువకులు వేగం, ఫీట్లపై పందాలు కాస్తుంటారు. ఉదాహరణకు జాతీయ రహదారిపై కాజ టోల్‌గేట్ నుంచి  మంగళగిరి-తెనాలి జంక్షన్ వరకు గమ్యమని నిర్ణయించుకుంటే సుమారు ఐదు కిలోమీటర్లు ఉండే ఈ దూరాన్ని ఎవరు ముందు దాటితే వారు విజయం సాధించినట్లు పరిగణిస్తారు. అత్యాధునిక బైకులు కావడంతో స్టార్ట్ చేసిన కొద్ది సెకన్లలోనే గంటకు 150 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంటాయి.
 = ఇక పందెం కోసం బైకులపై యువకులు చేసే ఫీట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి ఫీట్లను పెద్దగా జనసంచారం లేని రోడ్లపై చేస్తుంటారు. ప్రధానంగా చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డును వినియోగిస్తుంటారు. అతివేగంగా దూసుకువచ్చి సడన్ బ్రేక్ వేసి ముందు చక్రంపై బైక్‌ను నిలబెట్టడం, అతివేగంగా రింగ్‌లు తిరగడం, బైక్‌ను పడుకోబెట్టినట్టు ఉంచి ఎంతసేపు నడుపుతారనే విషయాలపై పందాలు జరుగుతుంటాయి.
 చర్యలు తీసుకుంటాం..
 ఈ విషయమై రూరల్ సీఐ హరికృష్ణ వివరణ కోరగా బైక్ రేసులు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎవరైనా బైక్ రేసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేసులు జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేస్తామని, రేసులు జరుగకుండా అడ్డుకోవడంతోపాటు యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement