విశాఖపట్నం, న్యూస్‌లైన్: గుడిలోవ విజ్ఞా న విహార్ 34వ వార్షికోత్సవం సందర్భం గా ఆదివారం విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా విన్యాసాలివి. విద్యార్థుల మానసిక శక్తికి, శారీరక దారుఢ్యానికి అద్దం పట్టా యి. పిల్లలు కాదు పిడుగులు అనిపించేలా మోటారు సైకిల్‌పై విద్యార్థులు చేసిన వి న్యాసాలు చూపరులను ఆశ్చర్యపరిచి వారి ధైర్య సాహాసాలకు ప్రతీకగా నిలిచాయి. మోటారు సైకిల్‌తో ట్యూబ్ లైట్లను పగలు గొట్టడం, నిప్పు చక్రాల నుంచి గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు గగుర్భాటు కలిగించాయి.
సైకిల్ పై వివిధ రకాల భం గిమలతో చేసిన అంశాలు వారి శారీరక దారుఢ్యానికి అద్దం పట్టాయి. వందమంది విద్యార్ధులు ఒకేసారి రెప్పపాటు కాలంలో నిర్మించిన పిరమిడ్ వారిలో సమైక్యతకు నిదర్శనగా నిలిచింది. పేర్లబార్, మల్లకంబలపై చేసిన వివిధ విన్యాసాలు అలరించాయి. వ్యాయామం ద్వారా ప్రదర్శించిన ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్స్ అంశం ఆహూతులతో నవ్వులు రువ్వించింది. ఈ సందర్భం గా జరిగిన సభకు రాయపూ ర్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విశ్వవిద్యాలయం ఉపకుల పతి సచ్చిదానంద జోషి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆయన ప్రసంగిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే యువతను వి ద్యాలయాలు తయారు చేయాలని పేర్కొన్నారు. విద్య వ్యాపారంగా మారిన ఈ రో జుల్లో విజ్ఞాన్ విహార్ వంటి కొన్ని సంస్థలే విలువులకు కట్టుబడి బోధన సాగిస్తున్నాయని కొనియాడారు. విశాఖ రామకృష్ణ మి షన్ ఆశ్రమం స్వామి గుణేశానందజీ మ హరాజ్ మాట్లాడుతూ ఉక్కునరాలు, ఇనుప కండరాలు గల యువతను తయారు చేయడం లో శారీరక శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
కార్యక్రమంలో విద్యాభార తి అఖిల భారత కార్యదర్శి ప్రకాష్ చంద్ర జీ, ఎస్‌ఆర్‌కే ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరుక్టర్ సత్యన్నారాయణ రాజు ప్రసంగిం చారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వాక్పతి రాజు, కార్యదర్శి డి.వి.వి కృష్ణంరాజు, విశా ఖ భారతీయ విద్యా కేంద్రం అధ్యక్షుడు నరసింహం, దూసి రామకృష్ణారావు, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అవధాని, రవిప్రకాష్ పాల్గొన్నారు.
యువశక్తి దేశానికి ఉపయోగపడాలి
Published Mon, Jan 6 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement