
ఇదో 'చెత్త' వాచీ
జకార్త : చెత్తే కదా అని తీసి పారేస్తే.. దాంతో వాచీలు చేసేసుకుంటాం అంటున్నారు.. ఇండోనేసియాలోని మటోవా కంపెనీ ఉద్యోగులు. అవును.. కాలుష్యం బారి నుంచి భూమాతను కాపాడేందుకు ఈ కంపెనీ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. చెత్తను రీసైక్లింగ్ చేసి, దాంతో వాచీలు తయారు చేసి అమ్ముతున్నారు.
చూడగానే ఇట్టే ఆకర్షిస్తున్న ఈ వాచీలతో కంపెనీ ఉద్యోగులు.సంచలనం సృష్టించారు. మకావా కంపెనీ ఒకప్పుడు ఫర్నీచర్ తయారు చేసేది. తమ వద్ద మిగిలిన చెక్కలు, ముక్కలతో ఈ ఎట్రాక్టివ్ వాచీలు తయారుచేస్తున్నారు. రోజుకు 25 రకాల వాచీలు తయారు చేస్తూ ఈ కంపెనీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా, సింగపూర్, చైనా, జపాన్, దక్షిణాఫ్రికాల నుంచి ఈ 'చెత్త వాచీ'లకు విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. మటోవా కంపెనీలో పనిచేసే సిబ్బంది 25 మంది మాత్రమే. అక్కడ తయారయ్యేది వారానికి 25 వాచీలు మాత్రమే.