విశాఖలో మరో మహిళకు స్వైన్‌ఫ్లూ | another woman succumbs to swine flu | Sakshi
Sakshi News home page

విశాఖలో మరో మహిళకు స్వైన్‌ఫ్లూ

Published Sun, Aug 9 2015 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

another  woman succumbs to swine flu

విశాఖపట్నం: విశాఖనగరం పరిధిలోని ఆరిలోవలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకటో వార్డు పరిధి గణేష్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల గృహణి జ్వరంతో బాధపడుతూ ఆరు రోజులుగా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు అక్కడి వైద్యులు గుర్తించి జీవీఎంసీ ఆరోగ్యం విభాగం అధికారులకు తెలిపారు. జీవీఎంసీ వైద్యులు ఆమె నివాసముంటున్న పరిసరాలను శనివారం సాయంత్రం శానిటరీ సిబ్బందిచే శుభ్రం చేయించారు.

చుట్టుపక్కల ఇళ్ల ముందు బ్లీచింగ్ చల్లి చెత్త తొలగించారు. అందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల విశాఖకు చెందిన ఓ మహిళ  స్వైన్‌ఫ్లూబారిన పడిన  విషయం విదితమే. ఆ మహిళ కోలుకుంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement