విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఓ మహిళ(34)కు స్వైన్ఫ్లూ సోకినట్లు వైద్యులు ఆదివారం నిర్ధారించారు. బాధితురాలు స్వైన్ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆమెకు స్వైన్ఫ్లూ పరీక్ష చేయగా పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు తెలిపారు.