
నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు.
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.
మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు.