చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ఓ వృద్ధురాలికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అనారోగ్యంతో వృద్ధ్ధురాలు శనివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.
ఆమె రక్త నమూనాలను హైదరాబాద్కు పంపగా... స్వైన్ఫ్లూ ఉన్నట్లు సోమవారం ఆస్పత్రికి సమాచారం అందింది. దీంతో ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్స ప్రారంభించారు.