సాఫ్ట్‌వేర్‌ యువతి.. పరీక్ష రాయడానికి వెళ్లి.. | Software Young Woman Missing In Chittoor | Sakshi

సాఫ్ట్‌వేర్‌ యువతి.. పరీక్ష రాయడానికి వెళ్లి..

Jul 13 2021 8:25 AM | Updated on Jul 13 2021 8:25 AM

Software Young Woman Missing In Chittoor - Sakshi

ఓ యువతి అదృశ్యమైనట్లు చిత్తూరు టూటౌన్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. వివరాలు.. స్థానిక కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన నవ్య(21) చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తోంది

చిత్తూరు అర్బన్‌: ఓ యువతి అదృశ్యమైనట్లు చిత్తూరు టూటౌన్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. వివరాలు.. స్థానిక కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన నవ్య(21) చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి నుంచే వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌ చేస్తున్న ఈమె ఈనెల 10న తిరుపతిలో ఓ పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో నవ్య తండ్రి రవికుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్‌ సీఐ యుగంధర్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకీ తెలిస్తే డయల్‌–100, ఫోన్‌–9491074517 నంబరుకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement