సాక్షి, చిత్తూరు(చెన్నై): విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ముగ్గురి భర్తల వద్ద మూడు పేర్లు చెప్పి వివాహం చేసుకున్న కిలాడీ లేడి విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నై ఆవడి సమీపంలోని ముత్తు పుదుపేట రాజీవ్‌నగర్‌కు చెందిన హరి(44) ఎంసీఏ పూర్తి చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి 2008లో చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వీరు 2014లో విడాకులు తీసుకున్నారు. దీంతో హరి రెండవ వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంటి పని చేస్తున్న వ్యక్తి ద్వారా ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశారు. ఆ సమయంలో ఆమె తనకు 35 ఏళ్లు అని, బంధువులు ఎవరూ లేదని చెప్పింది.
దీంతో హరి, శరణ్యను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఈ ఆస్తి వివరాలను చెప్పాలని హరితో శరణ్య తరచూ ఘర్షణ పడేది. ఆస్తులను తనపై పేరుపై రాసి పెట్టాలని కోరింది. చివరికి వరకట్న వేధింపులు గురి చేస్తున్నారని భర్త, అత్త ఇంద్రాణిపై తిరుపతి పోలీసులకు శరణ్య ఫిర్యాదు చేసింది. దీంతో హరి తల్లి ఇంద్రాణి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా శరణ్య నిజమైన పేరు సుగణ అని ఈమెకు 50 ఏళ్లని తేలింది. ఈమెకు ఇది వరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలున్నట్లు తెలిసింది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి శనివారం ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను సేలం, ఈరోడ్డు, కాట్పాడి వంటి రైల్వేస్టేషన్‌లోని క్యాంటిన్‌లో పని చేస్తున్నానని 2010లో ఆరణికి చెందిన ఏజెంట్ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగిందని పేర్కొన్నాడు. తన వద్ద ఆమె పేరును సంధ్య అని తెలిపిందన్నారు. గత పదేళ్లుగా శరణ్యతో తాను జీవించానని తమకు పిల్లలు లేదని 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్‌లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లి పోయిందని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!
Comments
Please login to add a commentAdd a comment