ఆక్సిజన్‌ కొరత: డాక్టర్‌ సహా, ఎనిమిది మంది మృతి | Delhi Hospital Says Doctor Among 8 Dead After It Ran Out Of Oxygen | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ కొరత: డాక్టర్‌ సహా, ఎనిమిది మంది మృతి

Published Sat, May 1 2021 3:17 PM | Last Updated on Sat, May 1 2021 4:50 PM

 Delhi Hospital Says Doctor Among 8 Dead After It Ran Out Of Oxygen - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్‌ కొరత తీవ్రం వేధిస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రులు ఆక్సిజన్‌ సప్లయ్‌ లేక అల్లాడి పోతున్నాయి. తాజాగా డిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో తీరని విషాదం  చోటు  చేసుకుంది. ఆక్సిజన్‌ లేకపోవడంవల్ల ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఆర్.కె. హిమాథని ఉండటం మరింత విషాదాన్ని నింపింది. ఐసీయూలో  చికిత్స పొందుతున్న మరో 5గురి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. 

దేశ రాజధానిలో ఆక్సిజన్ సంక్షోభంపై వరుసగా 11వ రోజు ఢిల్లీ హైకోర్టుకులో విచారణ జరిగింది. తమ వద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు అయిపోతున్నాయని తక్షణమే స్పందించాలని వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు వేడు కుంటున్నాయి. అంతకుముందు బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధాన్షు తాము ఆక్సిజన్‌ సంక్షోభంలో ఉన్నామనీ,  రాబోయే 10 నిమిషాల్లో పూర్తిగా అయిపోతుందని, ఆదుకోవాలంటూ  ఒక వీడియోను విడుదల చేయడం గమనార్హం. కానీ అధికారులు తేరుకుని  ఆక్సిజన్‌ రీ సప్లై ట్యాంకర్ చేరుకునేసరికే అనర్థం జరిగిపోయింది. రోగుల ప్రాణాలను రక్షించడంలో కీలకమైన ఆక్సిజన్ అందక ఊపిరి ఆగి పోతున్న వైనాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. అంతా అయిపోయిన 45 నిమిషాల తరువాత ట్యాంకర్ చేరుకుందని, అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.

చదవండి: విషాదం: టాలీవుడ్‌ యువ దర్శకుడు కరోనాతో మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement