లక్నో: మనుషులు చేసే కొన్ని చేష్టలు అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకు వస్తాయి. ముఖ్యంగా జంతువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. జంతువుల విషయంతో ఓవర్‌గా బిహేవ్ చేస్తే అవి ఇచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు మరి.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ముగ్గురు వ్యక్తులు ఏనుగులతో సెల్ఫీలు దిగుదామని డేర్ చేసి అతి చేశారు.
దీంతో, గజరాజులకు మండిపోయి.. వాటి వెంటపడ్డాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ.. లేస్తూ.. పడుతూ.. ఏనుగుల దాడి నుంచి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు నేపాల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో దుద్వా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుండగా అక్కడ ఏనుగుల గుంపు వారికి కనిపించింది. ఇంకేముంది.. వారి చేతిలో సెల్‌ఫోన్స్ తీసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో, వారి చేష్టలకు ఏనుగులకు చిర్రెత్తుకొచ్చింది. అనంతరం.. ఏనుగులు ఒక్కసారిగా వారి పైకి దూసుకొచ్చాయి. వెంటనే వణికిపోయి భయంతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు తీశారు. ఈ క్రమంలో పరుగులో అదుపుతప్పి ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఎలాగోలా ఏనుగుల బారినుంచి వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
लखीमपुर खीरी के दुधवा नेशनल पार्क में कुछ लोग हाथी के साथ सेल्फी ले रहे थे, अचानक हाथियों ने सभी को दौड़ा लिया।#LakhimpurKheri #DudhwaNationalPark #UttarPradesh #elephant #elephantattack #ViralVideos #lakhimpur #kheri #kheriviralvideo pic.twitter.com/4IH2Rkpj5c
— Daily Insider (@dailyinsiderup) July 5, 2023
ఇది కూడా చదవండి: వీడియో: ఫారినర్‌ను అసభ్యంగా తాకుతూ ఆ ఆటోడ్రైవర్ వేధింపులు.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment