
సాక్షి, ఛత్తీస్‌గఢ్: దంతరి జిల్లాలో దారుణం జరిగింది. విశ్రామ్‌పూర్ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు దాడిలో యువకుడు మృతిచెందాడు. విండోటోలా అటవీ ప్రాంతంలో కూలి పనులు చేసేందుకు వెళ్లిన యువకుడిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల కాళ్ల మధ్యలో నలిగిపోయిన యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
చదవండి: ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి
Comments
Please login to add a commentAdd a comment