మారపల్లిలో ఏనుగులు బీభత్సం | Elephants attack farmers fields in chittoor district marapallyvillage | Sakshi
Sakshi News home page

మారపల్లిలో ఏనుగులు బీభత్సం

Published Wed, Nov 19 2014 8:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Elephants attack farmers fields in chittoor district marapallyvillage

చిత్తూరు : చిత్తూరు జిల్లా రైతులను ఇటీవల కాలంలో ఏనుగులు ముప్ప తిప్పలు పెడుతున్నాయి. తాజాగా కుప్పం మండలం మారపల్లి గ్రామంలోని పంట పొలాలపై ఏనుగులు మంగళవారం అర్థరాత్రి దాడి చేసి... పంటలను పూర్తిగా నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో వరి, బీన్స్ పంట పొలాలు పూర్తిగా ధ్వంసమైనాయి. అప్పు చేసి సాగు చేసిన పంటలను ఏనుగులు పొట్టనపెట్టుకుంటున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. సోలార్ కంచెలను ఏర్పాటు చేసినా ఏనుగులు లెక్క చేయటం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతులు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏనుగులు ఎటువైపు నుంచి వచ్చి దాడులు చేస్తాయోనని రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు  హడలిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement