
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. బుధవారం అర్థరాత్రి పిచ్చాటూరు పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు మండలంలోని వేలూరు వెంగాలత్తూరు, రామాపురం మీదుగా పంట పొలాలను నాశనం చేస్తున్నాయి.
రామాపురంలో వరి పంటను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల గుంపు సంచారం ఉండటంతో ప్రజలు, రైతులు ఎప్పుడు దాడి చేస్తాయోమోనని భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగులను అడవిలోకి తరిమివేయాలని విజ్ఞప్తి చేశారు.