మధ్య పిలిఫీన్స్లో మిన్డాన్ పట్టణం సమీపంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం ధాటికి స్థానిక నౌకశ్రయంలో సగ భాగం నెలమట్టమైంది. ఆ ఘటనలో నలుగురు మృతి చెందారని తెలిపింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 7.4 నమోదు అయిందని చెప్పింది. భూకంపం తీవ్రతకు స్థానికంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.