సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కలమడుగు మధ్యనున్న గోదావరినది వంతెనపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సారంగాపూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బట్టల శ్రీనివాస్(23), ఇదే గ్రామానికి చెందిన వెయ్యినూరి రాజశేఖర్(17) ద్విచక్ర వాహనంపై కలమడుగు వద్ద ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన బోర్ల కుంట రాజన్న(30), బొర్లకుంట ప్రశాంత్( 22) జగిత్యాలకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్నారు.
ఈ క్రమంలో కమ్మునూర్-కలమడుగు వంతెనపై రెండు బైక్‌లు అతివేగంతో ఢీకొనడంతో బట్టల శ్రీనివాస్, బొర్నకుంట రాజన్న, బొర్నకుంట ప్రశాంత్ తలకు బలమైన దెబ్బలు తగిలి తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ రాజశేఖర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. శ్రీనివాస్‌కు ఏడాది క్రితమే లావణ్య అనే యువతితో వివాహం జరిగింది. ప్ర శాంత్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, జన్నారం మండలాలకు హెచ్‌ఎంటీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజన్నకు వివాహం జరిగి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.
సంఘటన స్థలానికి సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సారంగాపూర్ ఎస్‌ఐ నరేష్‌రెడ్డితో పాటు జన్నారం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల వివరాల కోసం పోలీసులు తర్జనభర్జన పడ్డారు. ఈ విషయూన్ని తేల్చుకోవడానికి ఆలస్యమైంది. ఈ విషయంపై ఎస్సై నరేష్‌రెడ్డి మాట్లాడుతు మురిమడుగు వెళ్తుతున్న రాజన్న, ప్రశాంత్ ఎడమ వైపు నుంచి కుడిదిక్కు వెళ్లి ఎదుటి వాహణాన్ని ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో ఆనవాళ్ల ద్వారా తెలుస్తోందన్నారు. చికిత్స పొందుతున్న రాజశేఖర్ మండలంలోని బీర్‌పూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
ప్రాణాలు తీసిన అతివేగం
Published Sat, Mar 21 2015 3:06 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement