రాజీవ్ రహదారిపై మరోసారి నెత్తురు పారింది.
మెదక్: రాజీవ్ రహదారిపై మరోసారి నెత్తురు పారింది. మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.