నకిరేకల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. జిల్లాలోని నకిరేకల్, రామన్నపేట, చింతపల్లి మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన బొల్లెపల్లి గోపాల్(48) హమాలీగా పని చేస్తున్నాడు. శాలీగౌరారం మండలం మాదారం గ్రామం నుంచి ట్రాక్టర్‌పై ధాన్యం తోడుతో నకిరేకల్‌కు బయలుదేరాడు. గోపాల్ ట్రాక్టర్ ఇంజన్‌పై డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. అర్వపల్లి మండలం బొల్లెపల్లికి చెందిన పాల్వాయి సోమ వెంకన్న(45) తన బంధువు మాచర్ల చిరంజీవితో కలిసి నోముల గ్రామంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్‌పై వస్తున్నారు. నకిరేకల్ వైపు నుంచి నోములకు వస్తున్న వీరి బైక్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై వెనక కూర్చున్న అర్వపల్లి మండలం బొల్లెపల్లికి చెందిన పాల్వాయి సోమ వెంకన్న రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్ ఇంజన్‌పై ఉన్న కట్టంగూర్ మండల అయిటిపాముల గ్రామానికి చెందిన బొల్లెపల్లి గోపాల్ కూడా రోడ్డుపై పడి తీవ్రగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని నకిరేకల్ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బైక్ నడుపుతున్న నోముల గ్రామానికి చెందిన మాచర్ల చిరంజీవికి గాయాలయ్యాయి. ఇద్దరి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.మృతుల కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి.
ఆటో, ఇన్నోవా ఢీ..
చింతపల్లి : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన చింతకాలయ నర్సింహ్మ (65) మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలంబైరపురం గ్రామంలో ఉంటున్న కూతురు ఇంటికి బయలుదేరాడు. మాల్ వెంకటేశ్వరనగర్‌లో ఆటో ఎక్కాడు. మార్గమధ్యలో చింతపల్లి మండలం గొడకొండ్ల సమీపంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఇన్నోవా వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నర్సింహ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపారు.
బైక్ చెట్టును ఢీకొట్టడంతో..
రామన్నపేట:చిట్యాల మండల కేంద్రానికి చెందిన నూనె స్వామి(45) తాపి మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఎన్నారం గ్రామంలో తనసమీప బంధువైన చిట్టిమాల సంజీవయ్య ఇంట్లో జరి గే దశదినకర్మకు హాజరయ్యేందుకు మండలి నర్సిం హతో కలిసి బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఎన్నారం గ్రామ శివారులోని మూలమలుపు వద్ద బైక్‌రాయి ఎక్కడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్వామికి తీవ్రగాయాలయ్యాయి. వెనుక ఆటోలో వస్తున్న మండలి శంకర్ గమనించి చికిత్స నిమిత్తం 108లో కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెం దాడు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
Published Wed, Apr 27 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement
Advertisement