బీహార్ లో నదిలో పడిన కారు: నలుగురి మృతి | Four killed as vehicle falls into ditch in Jehanabad | Sakshi
Sakshi News home page

బీహార్ లో నదిలో పడిన కారు: నలుగురి మృతి

Published Wed, Oct 16 2013 2:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Four killed as vehicle falls into ditch in Jehanabad

జహనాబాద్ : బీహార్‌ జహనాబాద్‌లో ప్రమాదవశాత్తు కారు నదిలో పడింది. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు.డ్రైవర్ వాహనాన్ని మలుపు తిప్పుతున్న సమయంలో నియంత్రణ కోల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మృతులను శర్మ (50),భార్య మాలతీ దేవి (40) నీలందేవి (35) రౌనక్ కుమార్ (9)గా పోలీసులు గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు.....మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ ప్రాంతంలో  తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement