Jehanabad
-
రోడ్డుకేసిన కాంక్రీట్ సిమెంట్ ఎత్తుకుపోయారు
-
సారా వ్యాపారుల బీభత్సం: కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి
పాట్నా: సారా తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు ఆ గ్రామంలో దాడులు చేశారు. అయితే పోలీసుల సమాచారం తెలుసుకున్న ఆ గ్రామస్తులు వారిని అడ్డగించారు. మూకుమ్మడిగా దాడి చేసి పోలీసులను చితకబాదారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. ప్రాణభయంతో ఆ గ్రామం నుంచి బయట పడ్డారు. ఈ సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. మద్యపానం నిషేధించడంతో ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కల్తీ మద్యం తాగి కొందరు మృతి చెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే జహనాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో సారా స్థావరాలు ఉన్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు శనివారం గ్రామానికి వెళ్లారు. ఈ సమాచారం ముందే తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులు రాగానే వారిని అడ్డగించారు. రోడ్లను బంద్ చేసి వారిపై ప్రతిదాడికి దిగారు. కర్రలు.. రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. కనిపించిన పోలీస్‌ను చితకబాదారు. దీంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఒక మహిళా కానిస్టేబుల్ మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాడి చేసిన వారిలో నలుగురైదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి అశోక్ పాండే తెలిపారు. కొన్ని పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
కొంప ముంచిన గాడిద సవారీ
ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు మందీ మార్బలంతో వెళుతుంటారు. కొందరు డజన్ల సంఖ్యలో కార్లతో వెళ్లి నామినేషన్లు వేస్తే మరి కొందరు గుర్రాల మీద, ఎడ్ల బండి పైన వచ్చి నామినేషన్లు వేస్తారు. అయితే, బిహార్‌కు చెందిన మణి భూషణ శర్మ అందరికంటే విలక్షణంగా ఉండాలని, అందరినీ ఆకర్షించాలని ఏకంగా గాడిదపై ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు.అయితే,ఆయన గాడిద సవారీ ఎంత మందిని ఆకట్టుకుందో తెలియదు కాని అధికారులకు మాత్రమే నచ్చలేదు. దాంతో జంతువుని హింసించాడంటూ శర్మపై కేసు పెట్టారు. బిహార్‌లోని హలస్‌నగర్ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల మణిభూషణ్ జెహనాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా లోక్‌సభకు పోటీ చేయాలని ఆశించారు. ఏడో దశలో అంటే మే 19న పోలింగు జరిగే ఈ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరిరోజు. ఆ రోజున గాడిదపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయనాయకులు ప్రజల్ని గాడిదల్లా చూస్తున్నారన్న సంగతి తెలియజేయడానికే తాను గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్టు శర్మ చెప్పారు. అయితే, ఎన్నికల అధికారులకు ఈ గాడిద సవారీ నచ్చలేదు. శర్మపై సర్కిల్ అధికారి సునీల్ కుమార్ జంతు హింస నివారణ చట్టం కింద కేసు పెట్టారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. పోనీ విధం చెడ్డా ఫలమైనా దక్కిందా అంటే అదీ లేదు. సాంకేతిక కారణాల వల్ల శర్మ నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు.పేరు కోసం చేసిన పని ప్రయోజనాన్నే నాశనం చేసిందంటూ శర్మ వాపోతున్నారు. స్థానికులు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా పోటీ చేసి ఓడిపోతుంటారని,ఇప్పుడు ఎన్నికలు జరగకుండానే ఓడిపోయారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
బీహార్ లో నదిలో పడిన కారు: నలుగురి మృతి
జహనాబాద్ : బీహార్ జహనాబాద్‌లో ప్రమాదవశాత్తు కారు నదిలో పడింది. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు.డ్రైవర్ వాహనాన్ని మలుపు తిప్పుతున్న సమయంలో నియంత్రణ కోల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను శర్మ (50),భార్య మాలతీ దేవి (40) నీలందేవి (35) రౌనక్ కుమార్ (9)గా పోలీసులు గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు.....మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.