గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద శుక్రవారం ఆగిఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.