
తీవ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో నిఘా కార్యాలయంపై ఆత్మాహుతి దాడే లక్ష్యంగా చేసుకున్న అల్ ఖైదా తీవ్రవాదుల లక్ష్యాన్ని పాక్ సైన్యం శుక్రవారం భగ్నం చేసింది. ఆ క్రమంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో కమాండర్తోపాటు ముగ్గురు తీవ్రవాదులు మరణించారు.
మృతదేహల వద్ద నుంచి ఆత్మహుతి జాకెట్లతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కరాచీలోని కైయమ్మబాద్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది.