పాకిస్థాన్లోని ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో బాంబు పేలుడు సంభవించింది.
పాకిస్థాన్లోని ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారని స్థానిక మీడియా డాన్ ఆన్లైన్ బుధవారం వెల్లడించింది. పాకిస్థాన్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ఖుర్రం ప్రాంతంలో రహదారి పక్కనే తీవ్రవాదులు బాంబు అమర్చిపెట్టారు. అయితే అదే సమయంలో అటుగా వాహనం వెళ్తున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది. దాంతో ఆ ఘటన చోటు చేసుకుందని డాన్ తెలిపింది.