అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, నలుగురు మృతి | 4 People, including two children, choke to death in fire at chennai apartment | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, నలుగురు మృతి

Published Mon, May 8 2017 8:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, నలుగురు మృతి - Sakshi

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, నలుగురు మృతి

చెన్నై : చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున వడపళని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిప్రమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురుని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పొగతో ఊపిరి ఆడక వారు మృతి చెందారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. మరోవైపు అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో పార్క్‌ చేసి ఉన్న బైక్‌లు దగ్ధం అయ్యాయి. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. మృతులు మీనాక్షి, సెల్వి, షాలిని, సంజయ్‌గా గుర్తించారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement