vadapalani
-
వడపళని హాస్పిటల్‌ను విక్రయిస్తున్న ఫోర్టిస్
న్యూఢిల్లీ: చెన్నైలోని వడపళని హాస్పిటల్ కార్యకలాపాలను రూ.152 కోట్లకు శ్రీ కావేరీ మెడికల్ కేర్‌కు విక్రయిస్తున్నట్టు ఫోరి్టస్ హెల్త్‌కేర్ ప్రకటించింది. తప్పనిసరి అమలు చేసే ఒప్పందాన్ని శ్రీకావేరీ మెడికల్ కేర్‌తో కుదుర్చుకుంది. ఈ లావాదేవీ పూర్తిగా నగదు చెల్లింపుల రూపంలోనే ఉంటుంది. జూలై నాటికి పూర్తి అవుతుందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. చెన్నైలోని ఆర్కాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన వడపళని హాస్పిటల్ 110 పడకల సామర్థ్యంతో ఉంది. దీన్ని 200 పడకల వరకు విస్తరించుకోవడానికి సౌలభ్యం కూడా ఉంది. కీలకమైన మార్కెట్లు, ప్రాంతాల వారీగా తమ హాస్పిటల్ ఆస్తులను మరింత అనుకూలంగా మార్చుకునే క్రమంలోనే ఈ విక్రయం నిర్వహిస్తున్నట్టు ఫోరి్టస్ హెల్త్‌కేర్ తెలిపింది. లాభదాయకత, మార్జిన్లను పెంచుకోవాలన్న తమ లక్ష్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది. అలాగే, కీలక మార్కెట్లలో తమ హాస్పిటల్ ఆస్తుల క్రమబద్ధీకరణకు సైతం ఇది తోడ్పడుతుందని తెలిపింది. ఈ కొనుగోలుతో తమ ఆస్పత్రి పడకల సామర్థ్యం 750 పడకలకు పెరుగుతుందని కావేరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ చంద్రకుమార్ తెలిపారు. దక్షిణాదిన ప్రముఖ, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదగాలన్న తమ ప్రణాళికలో ఇది భాగమన్నారు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం, నలుగురు మృతి
చెన్నై : చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున వడపళని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిప్రమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురుని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పొగతో ఊపిరి ఆడక వారు మృతి చెందారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. మరోవైపు అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసి ఉన్న బైక్‌లు దగ్ధం అయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. మృతులు మీనాక్షి, సెల్వి, షాలిని, సంజయ్గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.