కారును ఢీకొన్న లారీ
నలుగురు దుర్మరణం
కర్ణాటకవాసులుగా గుర్తింపు
శ్రీశైలం వెళ్తుండగా ఘటన అతివేగమే కారణం
ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మరో రెండు గంటల్లో శ్రీశైలం చేరుకోవాల్సిన తరుణంలో చోటు చేసుకున్న ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. అప్పటి వరకు పిల్లల చిలిపిచేష్టలతో సందడిగా సాగిన ప్రయాణం.. క్షణాల్లో భీతావహంగా మారిపోయింది. సగానికి పైగా వాహనం నుజ్జునుజ్జవడం.. క్షతగాత్రుల హాహాకారాల నడుమ పిల్లల బేల చూపులకు స్థానికుల గుండెలు బరువెక్కాయి.
ఆత్మకూరు:అతివేగం నలుగురిని పొట్టన పెట్టుకుం ది. శ్రీశైల మల్లన్న దర్శనార్థం వెళ్తున్న కర్ణాటకవాసు లు నలుగురు మార్గమధ్యంలోనే మృత్యువొడి చేరా రు. తుపాను వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్ర మాదం చోటు చేసుకుంది. ఘటనలో ఆరుగురికి తీ వ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్పంగా గా యపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సంఢోకి తాలూకా మూరటి గ్రామానికి చెందిన 14 మంది ఈనెల 3న మల్లన్న దర్శనార్థం శ్రీశైలానికి తుఫాన్ కారు(కేఈ32 ఎన్3282)లో బయలుదేరారు. ఆత్మకూరు మండల పరిధిలోని వెంకటాపురం వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని విజయవాడ నుంచి వెలుగోడుకు వెళ్తున్న లారీ(ఏపీ 21 పివి 8558) వేగంగా ఢీకొంది. ఘటనలో శాంతాబాయి(65), సోమశేఖర్ గోల(69) అక్కడికక్కడే మృతి చెందారు. పద్మావతి, సరోజలు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించారు. తీవ్రంగా గాయపడిన డ్రె ైవర్ రాజు, రేణుక, దుంగమ్మ, పార్వతి, రాజశేఖర్, నిర్మలను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన సుజాత, రవి, సునీల్, పార్వతిలకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యసేవలు అందించారు.
నుజునుజ్జయిన కారు
వేగంగా వస్తున్న కారు, లారీ సింగిల్ రోడ్డుపై అదు పు చేసుకోలేక ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో తు ఫాన్ కారు నుజునుజ్జయింది. ఘటనలో కారు డ్రైవర్ రాజుతో పాటు మరో ముగ్గురు రేకులకు అతుక్కుపోయారు. కారు పైభాగం ఎగిరిపడింది. వెనుక సీట్లో కూర్చున్న పిల్లలు మాత్రమే స్వల్ప గాయాలతో బ యటపడ్డారు. కార్డు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను, క్షతగాత్రులను స్థానికు లు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.
దేవుడా...
Published Sun, Apr 5 2015 1:57 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM