Faster
-
మళ్లీ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కారణమిదే!
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశంలోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్‌లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది. సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? సోనమ్ వాంగ్‌చుక్ వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా, వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్‌లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’ను స్థాపించారు. కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డులను అందుకున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్‌తో వాంగ్‌చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్‌చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్‌చుక్ తన దీక్షతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. #SAVELADAKH #SAVEHIMALAYAS Sonam Wangchuk appeals to the world to live simply, starts #ClimateFast of 21 days (extendable till death) Please watch full video in English here:https://t.co/XHkcIdQQ7b#ILiveSimply #MissionLiFE #ClimateActionNow pic.twitter.com/KQi5EMro9X — Sonam Wangchuk (@Wangchuk66) March 6, 2024 -
ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా..
క్విక్ అండ్ ఈజీ టెక్నాలజీతో ఈ గాడ్జెట్.. వేసవిలో చల్లటి డ్రింక్స్‌తో కూల్‌గా ఉంచుతుంది. వింటర్లో వేడి వేడి కాఫీ, టీలతో వెచ్చబరుస్తుంది. పార్టీలను చిల్ చేస్తుంది. ఇది రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్‌ని ఈ మగ్‌లో ఉంచి.. స్విచ్ ఆన్ చేస్తే.. అవి క్షణాల్లో కూల్ అవుతాయి. అలాగే ఓపెన్ చేసి.. వాటిని మగ్లోనే వేసుకుని మూత పెట్టుకోవచ్చు. అంతేకాదు వేడివేడిగా సూప్స్, టీ, కాఫీలనూ పెట్టుకోవచ్చు. చల్లగా కావడానికి వేరుగా.. వేడిగా కావడానికి వేరుగా ఆప్షన్స్ ఉంటాయి. ఏది కావాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోవాలంతే. ఈ డివైస్ చిన్నగా.. తేలిగ్గా ఉండటంతో.. దీన్ని పార్టీలు.. బీచ్‌లకు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. బాగుంది కదూ!. ఈ కూల్ అండ్ హాట్ కప్ ధర 34 డాలర్లు (రూ.2,818). ఇవి చదవండి: అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..! -
వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్!
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్‌కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్‌పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్‌కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్‌ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
‘గాంధీ’లో ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మందిఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థులపై వేటు పడింది. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు స్థానిక పోలీసులూ సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్‌కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు కోర్సుకు దూరం కావాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి మానసికంగా వేధించడం, బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్‌లు చేయించారు. భౌతికంగా దాడులు జరిగాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సమాచారం. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించింది. వారి సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ వరకే పరిమితమయ్యామని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివిధ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ ఆయన హెచ్చరించారు. -
కోర్టు ఆదేశాలు ‘ఫాస్టర్’గా..
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్) సాఫ్ట్‌వేర్‌ను గురువారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రారంభోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్‌గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్వేర్ రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు. ఈ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్ సెల్ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్వేర్ చేస్తుందన్నారు. ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ సంతకాలు, సంస్థాగత డిజిటల్ సంతకాలు ఉంటాయన్నారు. సమీప భవిష్యత్తులో హార్డ్‌కాపీలు అవసరం ఉన్న అన్ని రికార్డులు పూర్తిగా ఫాస్టర్ ద్వారా చేరవేయొచ్చని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. 16.7.2021న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్ రమణ ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు సూచనలు చేశారు. -
AP Floods: వేగంగా సాయం..
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వయంగా బాధిత ప్రాంతాలకు చేరుకుని సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీని ఇప్పటికే పూర్తి చేశారు. రోడ్ల పునరుద్ధరణతోపాటు దెబ్బతిన్న విద్యుత్తు లైన్లకు మరమ్మతులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. చెన్నై–విజయవాడ ప్రధాన లైన్‌లోని పడుగుపాడు–నెల్లూరు సెక్షన్లో వరదల వల్ల దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను 40 గంటల వ్యవధిలోనే పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. వడివడిగా సహాయ చర్యలు వైఎస్సార్ కడప జిల్లాలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పునరావాసం, సహాయ చర్యలు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె, పులపత్తూరు, గుండ్లూరు తదితర పది ముంపు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి 40 రోజులపాటు ఇవే బాధ్యతలు అప్పగించారు. అన్ని గ్రామాలలో ఒకేసారి పునరావాస పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇప్పటికే ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో పనులు పూర్తి కాగా మరో నాలుగు రోజుల్లో మిగిలిన చోట్ల కూడా పూర్తి కానున్నాయి. వరదల్లో సర్టిఫికెట్లు కొట్టుకుపోయిన విద్యార్థుల వివరాలను గ్రామాల వారీగా నమోదు చేస్తున్నారు. మరింత కుంగిన వంతెన... జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య పెన్నా వరద బీభత్సానికి కుంగిన హైలెవల్ బ్రిడ్జి మరింత కిందకు కుంగిపోవడంతో రాకపోకలను నిలిపివేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నదిలో వరదనీటి ప్రవాహం కొంత తగ్గింది. రెండు రోజుల క్రితం మైలవరం జలాశయం నుంచి పెన్నాలోకి 70 వేల నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వదలగా తాజాగా పది వేల క్యూసెక్కులకే పరిమితం చేశారు. హైలెవెల్ బ్రిడ్జికి మరమ్మతులు జరిగే వరకూ పురాతన లోలెవల్ బ్రిడ్జికి మరమ్మతులు చేసి రాకపోకలను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, అధికారులు ముంపు గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగిన వరి, చీనీ, అరటి పంటలను, అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో పర్యటించి బాధితులకు బకెట్లు, జగ్గులు, చీరెలు, దుప్పట్లు, టవళ్లు, బియ్యం పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో ఆచూకీ లేని ఐదుగురు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 132 శిబిరాల ద్వారా 32,310 మందికి పునరావాసం కల్పించి నిత్యావసరాలు, తక్షణ ఆర్థిక సాయం, వసతి, భోజన సౌకర్యాలను కల్పించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 66 మండలాల్లో 489 గ్రామాలు వరద ముంపునకు గురైనట్లు గుర్తించారు. 126 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 62,865 మంది బాధితులు వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో 11 మంది వరదల్లో కొట్టుకుపోగా ఇప్పటివరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదుగురి ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు లీకేజ్ పనులను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తూ మరమ్మతులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. చిత్తూరులోని కైలాసపురం వద్ద ముంపునకు గురైన వరద బాధితులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ పరామర్శించి నిత్యావసర వస్తువులు, దుస్తులను పంపిణీ చేశారు. 48,900 కుటుంబాలకు తక్షణ సాయం, నిత్యావసరాలు.. జనజీవనం కకావికలమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి. నష్టపోయిన 48,900 కుటుంబాలకు రూ.2 వేల తక్షణ ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ అందించారు. 92 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 212 ఇళ్లు పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ఆర్థిక సాయం పంపిణీకి సిద్ధం చేశారు. నష్టంపై శాఖలవారీగా ప్రాథమిక అంచనాలతో నివేదిక రూపొందించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం అప్పారావుపాళెం పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గిరిజన గూడేనికి చేరుకుని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. 40 గంటల్లో పడుగుపాడు–నెల్లూరు ట్రాక్ పనులు పూర్తి చెన్నై–విజయవాడ ప్రధాన లైన్‌లోని పడుగుపాడు–నెల్లూరు సెక్షన్లో వరదల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లను విజయవాడ డీఆర్ఎమ్ షివేద్రమోహన్ పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అవిశ్రాంత కృషితో కేవలం 40 గంటల వ్యవధిలోనే అప్‌లైన్, డౌన్లైన్లలో పునరుద్ధరించారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరద నీటి ఉధృతితో 1.8 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ మార్గంలో అన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నిటిని దారి మళ్లించి నడిపారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. రోడ్డు మార్గం దెబ్బతినడంతో కార్మికులను తరలించేందుకు 6 వర్కుమెన్ స్పెషల్ రైళ్లు, 12 జేసీబీలు, 4 ఎక్స్కవేటర్లు, 2 రైల్ లారీలను వినియోగించారు. 300 మంది కార్మికులు రాత్రి, పగలు అవిశ్రాంతంగా శ్రమించి పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఊరట చెందుతున్నాం.. గంటల వ్యవధిలో వరద ప్రవాహం ఇంట్లో చేరడంతో అంతా నీటి పాలైంది. వలంటీర్ల ద్వారా ప్రభుత్వం రూ.2 వేలు అందచేసింది. 25 కేజీలు బియ్యం, పప్పు, నూనె, ఇతర సరుకులు కూడా ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మరో రూ.3,800 నగదు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఊరటగా ఉంది. – శీరం రమణమ్మ పడుగుపాడు, కోవూరు మండలం (నెల్లూరు జిల్లా) ప్రభుత్వ సాయం బాగుంది వరద గ్రామాల్లో అధికారులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు బాగున్నాయి. డోజర్లు, జేసీబీలతో రోడ్లపై బురదను తొలగిస్తున్నారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చుతున్నారు. ప్రతి ఇంటికి రూ.5,800 ఆర్థిక సాయం అందించారు. నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారు. – శ్రీనివాసులు, మందపల్లె (కడప జిల్లా) ఇంటింటికీ మందులు, నిత్యావసరాలు వరదల వల్ల గ్రామాల్లోకి పెద్ద ఎత్తున బురద కొట్టుకుని వచ్చింది. ఫైరింజన్ల ద్వారా అధికారులు బురదను తొలగించారు. ప్రతి పూట భోజనాలు, మంచినీరు అందిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటికి మందులు ఇచ్చారు. రేషన్, నగదు, నూనె లాంటివి అందించి ఆదుకున్నారు. – లక్ష్మిదేవి, మందపల్లె (కడప జిల్లా) -
యువతులను మోసగించిన పాస్టర్ అరెస్ట్
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో మోసగిస్తున్న పాస్టర్‌ను అరెస్ట్ చేశారు. తణుకు సీఐ డీఎస్ చైతన్య కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెరవలి మండలం కాపవరం గ్రామానికి చెందిన రావూరి ప్రదీప్ పాస్టర్. అదే గ్రామానికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి బైక్, ల్యాప్‌ట్యాప్ కొనిపించుకున్నాడు కూడా. నిశ్చితార్థం తరువాత ప్రదీప్ çపరారయ్యాడు. అత్తిలి మండలం పాలూరు గ్రామానికి వెళ్లి అక్కడ పాస్టర్‌గా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన మరో యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారడు. దీంతో బాధితులిద్దరి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ప్రదీప్‌ను అరెస్ట్ చేసినట్టు సీఐ చెప్పారు. -
ఏడు రోజులుగా మావోయిస్టుల చెరలోనే..
నెల్లిపాక: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురంలో గత నెల 30న మావోరుుస్టులు అపహరించిన చర్చి పాస్టర్ కన్నయ్య కుమారుడు ఇస్సాక్‌కు ఇంకా విముక్తి లభించలేదు. కన్నయ్య కోసం సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చి, ఆయన లేకపోవటంతో పెద్ద కుమారుడు ఇస్సాక్‌ను తీసుకెళ్లారు. కన్నయ్య తమ వద్దకు వస్తేనే ఇస్సాక్‌ను విడిచి పెడతామని హెచ్చరించారు. కాగా పాస్టర్ కన్నయ్య ఆ రోజు నుంచి ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకోవటంతో ఇస్సాక్‌కు మావోయిస్టులు ఏదైనా ఆపద తలపెట్టి ఉంటారేమోనని అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మత బోధన చేసుకునే తమ కుటుంబానికి అపకారం తలపెట్టడం మావోయిస్టులకు ధర్మం కాదని, ఇస్సాక్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకుంటున్నారు. ఇస్సాక్‌ను విడిచి పెట్టేలా చూడాలని ప్రభుత్వ అధికారులను, పోలీసులను, మానవహక్కుల సంఘాల నేతలను అభ్యర్థిస్తున్నారు. కాగా పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. -
దేవుడా...
కారును ఢీకొన్న లారీ నలుగురు దుర్మరణం కర్ణాటకవాసులుగా గుర్తింపు శ్రీశైలం వెళ్తుండగా ఘటన అతివేగమే కారణం ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మరో రెండు గంటల్లో శ్రీశైలం చేరుకోవాల్సిన తరుణంలో చోటు చేసుకున్న ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. అప్పటి వరకు పిల్లల చిలిపిచేష్టలతో సందడిగా సాగిన ప్రయాణం.. క్షణాల్లో భీతావహంగా మారిపోయింది. సగానికి పైగా వాహనం నుజ్జునుజ్జవడం.. క్షతగాత్రుల హాహాకారాల నడుమ పిల్లల బేల చూపులకు స్థానికుల గుండెలు బరువెక్కాయి. ఆత్మకూరు:అతివేగం నలుగురిని పొట్టన పెట్టుకుం ది. శ్రీశైల మల్లన్న దర్శనార్థం వెళ్తున్న కర్ణాటకవాసు లు నలుగురు మార్గమధ్యంలోనే మృత్యువొడి చేరా రు. తుపాను వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్ర మాదం చోటు చేసుకుంది. ఘటనలో ఆరుగురికి తీ వ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్పంగా గా యపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సంఢోకి తాలూకా మూరటి గ్రామానికి చెందిన 14 మంది ఈనెల 3న మల్లన్న దర్శనార్థం శ్రీశైలానికి తుఫాన్ కారు(కేఈ32 ఎన్3282)లో బయలుదేరారు. ఆత్మకూరు మండల పరిధిలోని వెంకటాపురం వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని విజయవాడ నుంచి వెలుగోడుకు వెళ్తున్న లారీ(ఏపీ 21 పివి 8558) వేగంగా ఢీకొంది. ఘటనలో శాంతాబాయి(65), సోమశేఖర్ గోల(69) అక్కడికక్కడే మృతి చెందారు. పద్మావతి, సరోజలు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించారు. తీవ్రంగా గాయపడిన డ్రె ైవర్ రాజు, రేణుక, దుంగమ్మ, పార్వతి, రాజశేఖర్, నిర్మలను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన సుజాత, రవి, సునీల్, పార్వతిలకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యసేవలు అందించారు. నుజునుజ్జయిన కారు వేగంగా వస్తున్న కారు, లారీ సింగిల్ రోడ్డుపై అదు పు చేసుకోలేక ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో తు ఫాన్ కారు నుజునుజ్జయింది. ఘటనలో కారు డ్రైవర్ రాజుతో పాటు మరో ముగ్గురు రేకులకు అతుక్కుపోయారు. కారు పైభాగం ఎగిరిపడింది. వెనుక సీట్లో కూర్చున్న పిల్లలు మాత్రమే స్వల్ప గాయాలతో బ యటపడ్డారు. కార్డు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను, క్షతగాత్రులను స్థానికు లు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.