మునిపల్లి/నర్సాపూర్ రూరల్/ పటాన్‌చెరు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మునిపల్లి మండలం పొల్కంపల్లి శివారులో మంగళవారం రాత్రి బైక్ కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం కొమిషెట్‌పల్లి గ్రామానికి చెందిన ఎండీ ఆసీఫ్ (24)తో పాటు అదే గ్రామానికి చెందిన ఎండీ ముక్తాద్దీర్, మోమిన్‌పేట మండలానికి చెందిన ఎండీ ఇస్మాయిల్ (25)లు కలిసి సింగూరు ప్రాజెక్టులో సరదాగా గడిపేందుకు మంగళవారం సాయంత్రం బైక్‌పై వస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం మండలంలోని పొల్కంపల్లి శివారులోకి రాగానే అదుపు తప్పి క ల్వర్టును ఢీ కొంది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సల అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఎండీ ఆసీఫ్, ఇస్మాయిల్‌లు మృతి చెందారు. ఎండీ ముక్తాద్దీర్ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతు ల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున ్నట్లు బుదేరా ఎస్‌ఐ సాముల కోటేశ్వర్‌రావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన వివరించారు.
చెట్టును ఢీకొన్న లారీ..
చెట్టును ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ - మెదక్ రహదారిలోని రెడ్డిపల్లి సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గండిమైసమ్మకు చెందిన ఇసుక లారీ (టీఎస్ 07, 4199) ఇసుకలోడ్‌తో డ్రైవర్ రామ్‌భూపాల్‌రెడ్డి (45) మెదక్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రెడ్డిపల్లి సమీపంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్‌ఐ గోపీనాథ్ క్రేన్ రప్పించి దాని సాయంతో రామ్‌భూపాల్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీయించి నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ అని ఎస్‌ఐ తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
డీసీఎం వాహనం, బైక్ ఢీ
పటాన్‌చెరు : డీసీఎం వాహనాన్ని బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన పటాన్‌చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం చోటు చేసుకుంది. పటాన్‌చెరు సీఐ కృష్ణయ్య కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లికి చెందిన నవీన్ (25), సంగారెడ్డికి చెందిన మురళిలు బుధవారం బైక్‌పై సంగారెడ్డి వైపు వెళుతున్నారు. అయితే మండలంలోని ముత్తంగి వద్దకు రాగానే ముందు వెళుతున్న డీసీఎం వాహన డ్రైవర్ ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడంతో వెనుకనే వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మురళి తీవ్రంగా గాయపడ్డాడు. 108లో మురళిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నవీన్ స్వగ్రామం మేకవనంపల్లి అయినప్పటికీ ఆయన పటాన్‌చెరు దగ్గరలోని ఆర్సీ కోలా ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నట్లు ఆయన వివరించారు.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
Published Thu, Jun 11 2015 12:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement