రోడ్డుపై బోల్తాపడిన ట్రాక్టర్‌ని తొలగిస్తున్న పోలీసులు, జెన్‌కో ఉద్యోగులపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ప్రమా దం చోటు చేసుకుంది. సాగర్ దయ్యాలగండి రోడ్డుపై ఓ గడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు బోల్తా పడిన ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తొలగిస్తుండగా, నాగార్జునసాగర్ హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్, జెన్‌కో ఉద్యోగులను, వారి వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది.