చెన్నై: నగరంలో కూడంకుళం వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న కమిటీ నివాసాల్లో మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. మృతుల్లో మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని కూడంకుళం సమీపంలోని ఇదింతకారి గ్రామంలో నాటుబాంబులు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు సమీప గ్రామంలో సంభవించింది. అయితే కూడంకుళం నివాసాల్లో నాటుబాంబులు పేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స మేరకు సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.