న్యూస్‌లైన్ నెట్‌వర్క్: నల్లగొండ, నిజామాబాద్ జిల్లా లో ఆదివారం వడదెబ్బ బారిన పడి నలుగురు మరణించారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములకు చెందిన గోలి రామస్వామి (62), కోదాడ పట్టణానికి చెంది న పబ్బతి రామనర్సమ్మ (75), మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాకు చెందిన ముడావత్ సక్రియా (65)లు తట్టుకోలేక మరణించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో ఆదివారం వడదెబ్బసోకి పటేరి సునీత(30) అనే వివాహిత మరణించింది. పొలం పనులు చేస్తుండగా పడిపోయిందని గ్రామస్తులు తెలిపారు.