హైదరాబాద్ : వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న జీపును ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇక కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం థరూర్ శివారులో ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేసరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
Published Mon, Feb 3 2014 8:45 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement