kesarapalli
-
కేసరపల్లి బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్ విజువల్స్
-
అదుపుతప్పిన ప్రైవేటు బస్సు
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఆరేంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కేసరపల్లిలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
కృష్ణాజిల్లా, గన్నవరం : మండలంలోని కేసరపల్లి ఎస్సీ కాలనీలో రెండు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ వాతావరణం సర్దుమణుగుతున్న సమయంలో ఓ వర్గాన్ని రెచ్చకొట్టే విధంగా మరో వర్గం సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేయడం మళ్లీ వివాదానికి దారి తీసింది. దీంతో ఆదివారం రాత్రి ఇరువర్గాల పరస్పర దాడులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు నిరసనగా అంబేడ్కర్‌నగర్ యువకులు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన యువకులు ఎదురుపడడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీన్ని అడ్డుకునే క్రమంలో పికెటింగ్ ఉన్న పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో గొడవ మరింత పెద్దదైంది. అక్కడ నుంచి అంబేడ్కర్‌నగర్ వాసులు ర్యాలీగా వెళ్ళి సావరగూడెం బైపాస్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్, సీఐ శ్రీధర్‌కుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అయితే తమ యువకులపై దాడిచేసి కొట్టారంటూ జగ్జీవన్‌రామ్‌నగర్ వాసులు కేసరపల్లి – బుద్దవరం రోడ్డుపై అడ్డంగా రాళ్లుపెట్టి ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌నగర్ వాసులను ఇటుగా వెళ్లనీయబోమని భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలో అంబేద్కర్‌నగర్‌వాసులు అక్కడికి చేరుకోవడంతో వీరి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. దీంతో పోలీస్ బలగాలను రంగంలోకి దింపిన అధికారులు రోడ్డుపై కూర్చున్న ఆందోళనకారులను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు గంట సేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అదనపు సిబ్బందితో పాటు ఆందోళనకారులను చెదరకొట్టేందుకు టియర్ గ్యాస్ వెహికల్‌ను కూడా రంగంలోకి దింపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరువైపుల పెద్దలతో పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. చివరికి 11 గంటల సమయంలో ఇరువర్గాలను పంపించి వేయడంతో కొంత ఉద్రిక్తత తగ్గింది. అయితే నాలుగు రోజుల క్రితం ఇరువురు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారి గ్రామంలో అలజడి వాతావరణం నెలకొనడానికి దారి తీసింది. ఈ వివాదాన్ని మొదట్లోనే సర్దుబాటు చేయడంలో పోలీసుల వైఫల్యం చెందారు. ఫలితంగా గ్రామంలో ఇరువర్గాల పరస్పర దాడులు కొనసాగే పరిస్థితి వచ్చింది. -
కేసరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
గన్నవరం: మండలంలోని కేసరపల్లి బైపాస్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న ఓ స్కూటీతో పాటు రోడ్డు పక్కన ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరితో పాటు వీఆరోఏ తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టడుతున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం... అన్నవరం నుంచి విజయవాడ వైపు నలుగురు వ్యక్తులు హుందాయ్ క్రిటా కారులో విజయవాడ వైపు బయలుదేరారు. సుమారు 120 కిలోమీటర్లు వేగంతో వెళ్తున్న కారు కేసరపల్లి బైపాస్ వద్దకు రాగానే జాతీయ రహదారి దాటుతున్న స్కూటీ అడ్డుగా వచ్చింది. దీంతో వేగ నియంత్రణ కాకపోవడంతో స్కూటీని ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీఆర్ఏ మాగంటి ప్రభు(32)ను ఢీకొట్టుకుంటూ జాతీయ రహదారి పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ సుమారు 60 మీటర్ల దూరంలో ఎగిరిపడడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరికి, రోడ్డు పక్కన నిలబడి ఉన్న వీఆర్ఏ ప్రభుకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వీఆర్ఏ ప్రభును కానూరు రోడ్డులోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. స్కూటీపై ఉన్న ఇద్దరిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరిలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి పరిస్ధితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీపీ విజయభాస్కర్ నేతృత్వంలో సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్ఐ సత్యశ్రీనివాస్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. -
ముగిసిన ఎడ్ల పోటీలు
కేసరపల్లి(గన్నవరం) : మండలంలోని కేసరపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్లపోటీలు ఆదివారంతో ముగిశాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్ధానముల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో జూనియర్, సబ్‌జూనియర్, సీనియర్స్ విభాగాల్లో ఎడ్లజతలు పోటపోటీగా బలప్రదర్శన చేశాయి. సబ్‌జూనియర్స్ విభాగంలో పెనమలూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత రికార్డు స్థాయిలో బండను నిర్ణీత వ్యవధిలో 4,086 దూరం లాగి ప్రధమ స్థానం సాధించాయి. గుంటూరు జిల్లా కొప్పురావూరుకు చెందిన తోట శ్రీనివాసరావు ఎడ్లజత 3,498 అడుగులతో ద్వితీయ స్థానం, గుణదలకు చెందిన మండవ వెంకటరత్నం ఎడ్లజత 3,477 అడుగులతో తతీయ స్థానంలో నిలిచాయి. తోట శ్రీనివాసరావుకు చెందిన మరో ఎడ్లజత 3,442 అడుగులతో నాల్గోవ స్థానం, మోపిదేవి మండలం బొబ్బర్లంకకి చెందిన కోనేరు నిరూప్ 3,369 అడుగులతో ఐదోవ స్థానం దక్కించుకున్నాయి. జూనియర్స్ విభాగంలోః ఘంటసాలకు చెందిన గొర్రెపాటి నవనీత్కష్ణ ఎడ్లజత 3,300 అడుగులు బండనులాగి ప్రధమ స్థానం, మొవ్వకు చెందిన తాతినేని పిచ్చేశ్వరరావు ఎడ్లజత 2,853 అడుగులతో ద్వితీయం, డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత 1,500 అడుగులతో తతీయ స్ధానంలో నిలిచాయి. సీనియర్స్ విభాగంలోః సీనియర్స్ విభాగంలో కష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత నిర్ణీత సమయంలో బండను 2,400 అడుగులు దూరంలాగి ప్రధమ స్థానం సాధించాయి. గన్నవరానికి చెందిన కాసరనేని పవన్, గగన్చౌదరిల ఎడ్లజత బండను 2,278 అడుగుల దూరంలాగి ద్వితీయ స్థానం సాధించాయి. తెనాలికి చెందిన భట్టా నాగసాయినివేష్, గౌతమ్, నితిన్‌ల ఎడ్లజత 1,800 అడుగులతో తతీయ స్థానం సాధించాయి. గుణదలకు చెందిన మండవ వెంకటరత్నం ఎడ్లజత నాల్గవ స్థానం, మొవ్వకు చెందిన తాతినేని పిచ్చేశ్వరరావు ఎడ్లజత ఐదోవ స్థానంలో నిలిచాయి. ఎడ్లజతల నిర్వాహకులకు గన్నవరం పుర ప్రముఖులు కంఠమనేని శ్రీనివాసరావు ఆర్ధిక సౌజన్యంతో రూ. 1.60 లక్షల నగదును ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చేతుల మీదుగా అందజేశారు. మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావు, వైస్ ఎంపీపీ గొంది పరందామయ్య, పారిశ్రామికవేత్త తియ్యగూర వీరారెడ్డి, నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేద్యం విభాగంలో కృష్ణాజిల్లా ఎడ్లు సై
గన్నవరం : మండలంలోని కేసరపల్లిలో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీల్లో కృష్ణాజిల్లా ఎడ్లు సత్తా చాటుతున్నాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం రాత్రి వరకూ జరిగిన వ్యవసాయ సేద్యం విభాగంలో పోటాపోటీగా జరిగిన ప్రదర్శనలో వరుసగా నాలుగు స్థానాలను జిల్లా ఎడ్లు కైవసం చేసుకున్నాయి. కృష్ణాజిల్లా గన్నవరం మండంల మెట్లపల్లికి చెందిన చిలకపాటి రాజీవ్ ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను రికార్డు స్థాయిలో 4,346 దూరం లాగి ప్రథమ స్థానం సాధించాయి. పెనమలూరు మండలం కానూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు ఎడ్లజత 3,989 అడుగులతో ద్వితీయం, పెనమలూరుకు చెందిన కోయి జగన్మోహన్రావు ఎడ్లజత 3,636 అడుగులతో తృతీయ స్థానంలో నిలిచాయి. మెట్లపల్లికి చెందిన చిలకపాటి రాజీవ్‌కు చెందిన మరో ఎడ్లజత 3,600 దూరంలాగి నాల్గో స్థానం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కాకాని శ్రీహరిరావు ఎడ్లజత 3,545 అడుగులతో ఐదో స్థానంలో నిలిచాయి. అనంతరం వరుసగా ఐదు స్థానాల్లో నిలిచిన ఎడ్లజతలకు డీవీఆర్ మెమోరియల్ ద్వారా వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు దేవభక్తుని సుబ్బారావు మొత్తం రూ.72వేల బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులను వృద్ధి చేసేందుకు, వాటి పోషకులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. కాగా, శుక్రవారం సబ్‌జూనియర్స్ విభాగంలో పోటీలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చిన 15 ఎడ్లజతలు ఈ పోటీల్లో బలప్రదర్శన చేస్తున్నాయి. పోటీల నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, శనగల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, పుర ప్రముఖులు కంఠమనేని శ్రీనివాసరావు, పెదకడిమి సొసైటీ అధ్యక్షుడు చల్లగుళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బలప్రదర్శనను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో రావడంలో పోటీ ప్రాంగణం కోలాహలంగా మారింది. -
ఆరుపళ్ల విభాగంలో ప్రకాశం ఫస్ట్
గన్నవరం : మండలంలోని కేసరపల్లిలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకూ ఆరుపళ్ల విభాగంలో పోటీలు జరిగాయి. మొత్తం పది ఎడ్ల జతలు పాల్గొనగా, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన నుసుం బయ్యప్పరెడ్డి ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను 3,749.2 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.20వేల బహుమతి అందుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్లజత 3,385.6 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.15వేలు, ప్రత్తిపాడుకు చెందిన నూతలపాటి పరమేశ్వరరావు ఎడ్లజత 3,319 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచి రూ.12వేల బహుమతి అందుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరుకు చెందిన దొడ్డక సాయికృష్ణ ఎడ్లు 3,245 అడుగులు లాగి నాల్గో స్థానంలో రూ.10వేలు, విజయవాడకు చెందిన మేకా కృష్ణమోహన్ ఎడ్లజత 3,050 అడుగులు లాగి ఐదో స్థానంలో రూ.6వేల నగదు అందుకున్నాయి. అనంతరం ఆరుపళ్ల విభాగపు స్పాన్సర్ వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్ ఎడ్లజతల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. సేద్యపు విభాగంలో.. రైతు సేద్యపు విభాగంలో గురువారం పోటీలు కొనసాగాయి. రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 12 ఎడ్లజతలు ఈ విభాగంలో హోరాహోరీగా బలప్రదర్శనను సాగిస్తున్నాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్ధనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, ఇందిరా పుడ్స్ అధినేత మండవ వెంకటరత్నం, రైతు నాయకులు నందమూరి రాధాకృష్ణమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు వీక్షించారు. నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, రిపరీ సురపనేని రాధాకృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుపళ్ల విభాగంలో ప్రకాశం ఫస్ట్
గన్నవరం : మండలంలోని కేసరపల్లిలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకూ ఆరుపళ్ల విభాగంలో పోటీలు జరిగాయి. మొత్తం పది ఎడ్ల జతలు పాల్గొనగా, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన నుసుం బయ్యప్పరెడ్డి ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను 3,749.2 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.20వేల బహుమతి అందుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్లజత 3,385.6 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.15వేలు, ప్రత్తిపాడుకు చెందిన నూతలపాటి పరమేశ్వరరావు ఎడ్లజత 3,319 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచి రూ.12వేల బహుమతి అందుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరుకు చెందిన దొడ్డక సాయికృష్ణ ఎడ్లు 3,245 అడుగులు లాగి నాల్గో స్థానంలో రూ.10వేలు, విజయవాడకు చెందిన మేకా కృష్ణమోహన్ ఎడ్లజత 3,050 అడుగులు లాగి ఐదో స్థానంలో రూ.6వేల నగదు అందుకున్నాయి. అనంతరం ఆరుపళ్ల విభాగపు స్పాన్సర్ వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్ ఎడ్లజతల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. సేద్యపు విభాగంలో.. రైతు సేద్యపు విభాగంలో గురువారం పోటీలు కొనసాగాయి. రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 12 ఎడ్లజతలు ఈ విభాగంలో హోరాహోరీగా బలప్రదర్శనను సాగిస్తున్నాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్ధనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, ఇందిరా పుడ్స్ అధినేత మండవ వెంకటరత్నం, రైతు నాయకులు నందమూరి రాధాకృష్ణమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు వీక్షించారు. నిర్వాహకులు మల్లంపాటి బాబూరావు, వింత సాంబిరెడ్డి, రిపరీ సురపనేని రాధాకృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు పళ్ల విభాగంలో సత్తాచాటిన కృష్ణాజిల్లా ఎడ్లు
కేసరపల్లి (గన్నవరం) : మండలంలోని కేసరపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీవీరాంజనేయస్వామి, శ్రీషిర్డి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. తొలుత ఈ పోటీలను ఒంగోలు జాతి పశు సంరక్షణ సంఘ నాయకులు వింత సాంబిరెడ్డి, మల్లంపాటి బాబూరావు, మాజీ ఎంపీపీ పొట్లూరి బసవరావు ప్రారంభించారు. అనంతరం రెండు పళ్ల విభాగంలో పోటాపోటీగా జరిగిన బలప్రదర్శనలో కృష్ణాజిల్లా ఎడ్లు ప్రథమ స్థానం సాధించాయి. ఈ విభాగంలో మొత్తం పది ఎడ్లజతలు పాల్గొనగా, విజయవాడకు చెందిన మేకా కృష్ణమోహన్ ఎడ్లజత నిర్ణీత వ్యవధిలో బండను 3,346 అడుగుల దూరంలాగి విజేతగా నిలిచింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన చంటి గణేష్‌రెడ్డి ఎడ్లజత 3,642 అడుగులు లాగి ద్వితీయ స్థానం సాధించింది. గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం ఉప్పలపాడుకు చెందిన మంచిగంటి శివనాగలలిత సుభాష్ ఎడ్లజత 3,323 అడుగులు, కృష్ణాజిల్లా పెదపులిపాకకు చెందిన గరికపాటి శ్రీధర్, గుంటూరు జిల్లా నడుంపల్లికి చెందిన కొడాలి మోహన్స్నిగ్ధ కంబైన్డ్ ఎడ్లజత 3,300 అడుగులు, పెదకాకాని మండలం కొప్పిరావూరుకు చెందిన అప్పికట్ల వెంకటేశ్వర్లు ఎడ్లజత 2,281 అడుగుల దూరం బండను లాగి వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. అనంతరం గెలుపొందిన ఎడ్లజతల యాజమానులకు నగదు బహుమతులు అందజేశారు. తొలిరోజు ఎడ్ల బలప్రదర్శనను వీక్షించేందుకు రైతు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోటీలకు రిఫరీగా సూరపనేని రాధాకృష్ణప్రసాద్ వ్యవహరించగా, పెదకడిమి పీఏసీఎస్ అధ్యక్షుడు చలగుళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఆరుపళ్ల విభాగంలో పోటీలు కొనసాగుతాయి. -
మద్యం మత్తులో జనం మీదికి...
► గన్నవరం వద్ద కారు బీభత్సం ► బైక్‌ను, రెండు ఆటోలను ఢీ ► రైతు దుర్మరణం, నలుగురికి గాయాలు ► ఆ కారులో జనసేన సభకు వెళ్లి వస్తున్నారా? ► పరారీలో డ్రైవరు, పోలీసుల అదుపులో ఒకరు గన్నవరం : మద్యం మత్తులో ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోవడంతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గన్నవరం మండంలోని కేసరపల్లి బైపాస్ వద్ద శనివారం ఒక తాగుబోతు కారు డ్రైవర్ నానా బీభత్సం సృష్టించాడు. పోలీసుల సమాచారం ప్రకారం... కేసరపల్లి గ్రామానికి చెందిన రైతు నెరుసు రామారావు(53) శనివారం ఉదయం పొలానికి వెళ్ళేందుకు ఇంటి నుండి బైక్‌పై బయలుదేరాడు. సావరిగూడెం బైపాస్ వద్దకు రాగనే ఏలూరు నుంచి విజయవాడ వైపు వేగంగా దూసుకువచ్చిన కారు రామారావు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఎదురుగా ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగివున్న టాటా మ్యాజిక్‌తో పాటు కూలీలను ఎక్కించుకుని వెళ్తున్న ట్రక్ ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా మ్యాజిక్‌లో ఉన్న ప్రయాణికుల్లో నాలుగురికి కూడా తీవ్రగాయాలు తగిలాయి. మద్యం మత్తు.. అతివేగం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, మితిమీరిన వేగంతో దూసుకొచ్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారుకాగా, కారులో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరు కాకినాడలో జరిగిన జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సమావేశానికి వెళ్ళివస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ కారు విజయవాడ ఆటోనగర్‌లో ఒక పాదరక్షల ఫ్యాక్టరీ నిర్వాహకులదని సమాచారం. ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్
-
యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్
గన్నవరం: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు మిస్టరీ వీడింది. మృతురాలే దాడి చేయిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తన ప్రియుడిపై దాడి చేయాలకున్న ఆమె ప్రయత్నం బెడిసి కొట్టడంతో రాణి ప్రాణాలు పోగొట్టుకుంది. తనతో సహజీవనం చేస్తున్న కఠారి రాజేష్ కు పెళ్లి కుదరడంతో అతడిపై యాసిడ్ చేసేందుకు ఇద్దరు యువకులతో రాణి ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాన్ లో భాగంగానే కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో బుడమేరు వంతెన వద్ద శుక్రవారం రాత్రి రాజేష్, రాణిపై యాసిడ్ దాడి జరిగింది. అయితే దాడి సమయంలో రాణి బైకు పైనుంచి కింద పడిపోడంతో తలకు గాయమై ఆస్పత్రిలో మృతి చెందింది. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో కేసు మిస్టరీ వీడింది. -
కేసరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
హైదరాబాద్ : వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న జీపును ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇక కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం థరూర్ శివారులో ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.