
సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఆరేంజ్ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.