
సాక్షి, గన్నవరం : ఆగివున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. విజయవాడ నుండి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున గన్నవరం ఆంధ్రా బ్యాంక్ సమీపంలో టైర్ పంచర్ పడింది. దీంతో బస్సును డ్రైవర్ ప్రక్కకు తీసి నిలిపి మరమ్మతులు చేస్తుండగా వెనుక నుండి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్సుధాకర్ అక్కడకక్కడే మృతి చెందాడు. అయితే బస్సులో వున్న 30 మంది ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.