కూలిన బొగ్గు గని : నలుగురు మృతి | Four killed, 26 missing after Russian mine accident | Sakshi
Sakshi News home page

కూలిన బొగ్గు గని : నలుగురు మృతి

Published Fri, Feb 26 2016 6:04 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

కూలిన బొగ్గు గని : నలుగురు మృతి

కూలిన బొగ్గు గని : నలుగురు మృతి

మాస్కో : ఉత్తర రష్యా కొమి ప్రాంతంలోని సెవర్నియా బొగ్గు గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో 26 మంది గల్లంతు అయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. శిథిలాల నుంచి మాత్రం ఎనిమిది మందిని రక్షించి...పైకి తీసుకువచ్చినట్లు  తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు ముమ్మరం చేశామన్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 110 మంది పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని పేర్కొన్నారు. గనిలో ఒత్తిడి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై వార్త తెలిసిన వెంటనే అత్యవసర సేవల మంత్రి వాద్లమిర్ పుచ్కొవ్ ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా రష్యాతోపాటు సోవియేట్ దేశాల్లోని బొగ్గు గనులు కుప్పకూలడం సాధరణమైన విషయమే. ఈ ప్రమాదం గురువారం చోటు చేసుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement