
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కిటకిటలాడుతున్న రోగులు
బోనకల్/బూర్గంపాడు/కారేపల్లి : విజృంభిస్తున్న జ్వరాలు జిల్లాలో నలుగురిని బలిగొన్నాయి. బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన మర్రి ఆదిలక్ష్మి (30) మూడురోజులుగా జ్వరంతో బాధపడుతోంది. గురువారం తీవ్రతరం కావడంతో మృత్యువాత పడింది. బూర్గంపాడు మండలం పాతసారపాకకు చెందిన కేసుపాక భద్రమ్మ(55) వారం రోజుల క్రితం జ్వరం బారిన పడింది. భద్రాచలం తీసుకెళ్లినా తగ్గలేదు. మూడురోజుల క్రితం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కారేపల్లి మండలం మొట్లగూడెంకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కొమ్మినేని లలితమ్మ(45) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీనికి తోడు డైయాబెటీస్ ఉండటంతో.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ఇదే మండలం చింతలపాడుకు చెందిన దూడ మోహన్‌రావు(35) వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నాడు. ప్లేట్‌లెట్స్ తగ్గడంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.