:జిల్లాలోని నల్లమల రోళ్లపెంట ఘాట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది.
కర్నూలు:జిల్లాలోని నల్లమల రోళ్లపెంట ఘాట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ లారీ లోయలోకి దూసుకుపోవడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. విశాఖ నుంచి బళ్లారికి కాగితం పట్టాల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇందులో గాయపడిన వారిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.