ఎన్టీఆర్‌ జిల్లాలో రోడ్‌ టెర్రర్‌.. ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు.. | Terror Road Accident At NTR District's Itavaram | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ జిల్లా: ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు.. ఇద్దరు మృతి

Published Sat, Jun 29 2024 11:57 AM | Last Updated on Sat, Jun 29 2024 12:05 PM

Terror Road Accident At NTR District's Itavaram

సాక్షి, ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌ జిల్లాలోని ఐతవరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ దుర్మరణం చెందారు. ఒకే స్పాట్‌లో కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఖాళీ గ్యాస్‌ సిలిండర్ల లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే, అదే మార్గంలో వస్తున్న మరో కంటైనర్‌.. ప్రమాదానికి గురైన లారీ ఢీకొట్టింది. దీంతో, లారీ ముందున్న ఇద్దరు వ్యక్తులు(తండ్రి, కొడుకు) మృతిచెందారు.

ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ డ్రైవర్‌ పారిపోయే ప్రయత్నం చేశాడు. కంటైనర్‌ను స్పీడ్‌గా నడపడంతో సదరు కంటైనర్‌.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, సమాచారం అందుకున్న  కంచికచర్ల హైవే మొబైల్‌ పోలీసులు కేసర వద్ద ఆ కంటైనర్‌ను  పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో మృతులు ఎన్టీఆర్‌ జిల్లా ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు(65), అతని కుమారుడు సంకు రామరాజు(45)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement