మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల మండలం అయ్యవారిపల్లెలో మంగళవారం తెల్లవారుజామున కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల మండలం అయ్యవారిపల్లెలో మంగళవారం తెల్లవారుజామున కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అలాగే విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని విశాఖ నగరంలోని కింగ్ జార్జీ ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టులో మినీ బస్సు బోల్తా పడింది. ఆ మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధితులంతా హైదరాబాద్ వాసులే.