puthalapattu
-
పూతలపట్టులో పోటెత్తిన జనం
-
సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్.. పూతలపట్టులో పూనకాలు
-
అభిమానం పూలవర్షమై.. జైత్రయాత్రకు నీరా‘జనం’ (ఫొటోలు)
-
దద్దరిల్లిన పూతలపట్టు.. సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ ఇవే
సాక్షి, చిత్తూరు జిల్లా: ఒకటో తేదీన సూర్యుడు ఉదయించముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారని, అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా శాడిస్టా అనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన పూతలపట్టు బహిరంగ సభలో మాట్లాడుతూ, చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా? అంటూ ప్రశ్నించారు. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ►ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. ►జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు ►ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది ►ఈ యుద్ధంలో నేను ప్రజలపక్షాన ఉన్నా ►అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్ గిప్ట్గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు ►ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు ►ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి. ►ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే ►జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ►పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా? ►ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంది ►చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? ►చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా? ►వార్డు, సచివాలయాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్ ►రైతు భరోసా కేంద్రాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్ ►ప్రభుత్వ బడులను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్ ►విలేజ్ క్లినిక్‌లను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్ ►వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది ఎవరంటే.. మీ జగన్ ►మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్. ►మే 13న జరగబోయే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ►పేదలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలను రక్షించేందుకు సిద్ధమా? ►రూ.3వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే ►రైతు భరోసాకు రైతన్నలకు అండగా నిలబడ్డాం ►రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం ►130 సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం ♦14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు ♦2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. చేశాడా? ♦డ్వాక్రా రుణమాఫి అన్నాడు.. ఒక్క రూపాయి అయినా చేశాడా? ♦ఆడబిడ్డ పుడితే 25 వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా? ♦ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా? -
ఇంటికి వెళ్లి మీ పిల్లలను కూడా అడగండి మంచి జరిగింది అనిపిస్తేనే నాకు ఓటు వేయండి
-
పూతలపట్టులో నాకు జనసముద్రం కనిపిస్తుంది: వైఎస్ జగన్
-
పుట్టపర్తి బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
-
చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు జిల్లా: జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పూతలపట్టులో జన మహా సముద్రం కనిపిస్తోందన్నారు. ‘‘మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా?. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్ గిప్ట్గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్ డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం. ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్ చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?. వార్డు, సచివాలయాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. రైతు భరోసా కేంద్రాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. ప్రభుత్వ బడులను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. విలేజ్ క్లినిక్‌లను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది ఎవరంటే.. మీ జగన్. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్.. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంది. మే 13న జరగబోయే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి’’ సీఎం జగన్ కోరారు. 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం.. పేదలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలను రక్షించేందుకు సిద్ధమా?. రూ.3వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. రైతు భరోసాకు రైతన్నలకు అండగా నిలబడ్డాం. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం. 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. చేశాడా?. డ్వాక్రా రుణమాఫి అన్నాడు.. ఒక్క రూపాయి అయినా చేశాడా?. ఆడబిడ్డ పుడితే 25 వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా?. ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగభతి ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా?. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు’’ అని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది.. ఒకటో తేదీన సూర్యుడు ఉదయించముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారు. అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుంది. ఇలాంటికి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా?. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చింది’’ అని సీఎం జగన్ చెప్పారు. -
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ @ పూతలపట్టు
-
జన సునామి మధ్య పూతలపట్టు సభకు చేరుకున్న సీఎం జగన్
-
Watch Live: పూతలపట్టు మేమంతా సిద్ధం సభ
-
పూతలపట్టు టీడీపీ ఇంచార్జ్ ఎవరు?
-
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో రోడ్డు ప్రమాదం
-
పాపం..! చూస్తుండగానే కాలిబూడిదైన కారు
-
కారు కొనుక్కుని పూజకు వెళ్తుండగా..
సాక్షి, చిత్తూరు: రోడ్డుపై వెళ్తుండగా అనూహ్యంగా కారులో మంటలు చెలరేగిన ఘటన ఆరో జాతీయ రహదారిపై పూతలపట్టు మండలంలోని వజ్జి రెడ్డిపల్లి వద్ద చోటుచేసుకుంది. కే.ఎన్.ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న రాజేష్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి కాణిపాకంలో పూజకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. కష్టపడి కొనుక్కున్న కారు మంటలకు ఆహుతైందని రాజేష్ వాపోయాడు. (స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం) -
నిద్రమత్తు తెచ్చిన అనర్థం
శ్రీవారి దర్శనార్థం తమిళనాడు నుంచి తిరుమలకు కుటుంబ సభ్యులతో వచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత చుట్టు పక్కల దేవాలయాలనూ సందర్శించి మొక్కులు చెల్లించారు. తిరుగు ప్రయాణంలో విధి నిద్రమత్తు రూపంలో వారిని ప్రమాదానికి గురి చేసింది. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును తమిళనాడు వాసుల క్వాలిస్ ఢీకొనడంతో కుటుంబ యజమాని దుర్మరణం చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, పూతలపట్టు(చిత్తూరు) : తమిళనాడులోని వాలాజా తాలూకా, మాంధాగల్‌కు చెందిన హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో క్వాలిస్‌లో సోమవారం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యమైన ఆలయాలను సందర్శించి బుధవారం తిరుగు పయనమయ్యారు. పూతలపట్టు మండలంలోని బాలాజీ కల్యాణ మండపం వద్ద వారి వాహనం ప్రమాదానికి గురైంది. తమిళనాడు దిండిగల్ నుంచి తిరుమలకు వెళ్తున్న ప్రైవేటు బస్సును అదుపు తప్పి ఢీకొంది. ఈ దుర్ఘటనలో క్వాలిస్‌ను నడుపుతున్న హరికృష్ణ(32)తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న అతడి తల్లి వల్లియమ్మ(60), భార్య ప్రియ(21), మరదళ్లు రేణుక(17), రేవతి(17), పిన్నమ్మ రాధ (36), రాధ కుమార్తె అభినయ(10)లకు తీవ్రగాయాలయ్యాయి. రెండు వాహనాల ముందరి భాగాలు బాగా దెబ్బతిన్నాయి. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఈ ప్రమాదం సంభవించడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు. వల్లియమ్మ, రేవతి పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరులో ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి తరలించారు. పూతలపట్టు ఏఎస్ఐ వడివేలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పూతల‘పట్టు’ పోయినట్టే?
-
చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి..!
-
పత్తా లేకుండా పోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
సాక్షి, చిత్తూరు : టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కొందరు టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. పూతల పట్టు నియోజనవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. టికెట్ కేటాయించి 36 గంటలైనా గడవకముందే పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. తనకు టికెట్ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితమే ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని అతను వెల్లడించినట్టు సమాచారం. పూతలపట్టు టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో లలితకుమారి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సోమవారం రాత్రి ఆమెకు ఒక్కసారిగా షాక్ తగిలింది. టీడీపీ విడుదల చేసిన తుది జాబితాలో పూతలపట్టు టికెట్‌ను పూర్ణం అనే కొత్త వ్యక్తికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎస్ బాబు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. -
చంద్రబాబు సీఎం ఐతే చాలు.. ఆ ఫ్యాక్టరీలు మూతబడతాయి!
సాక్షి, పూతలపట్టు (చిత్తూరు జిల్లా) : చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు.. సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతబడుతాయని, అందుకు తాజా నిదర్శనం చిత్తూరు జిల్లాలోని చక్కర ఫ్యాక్టరీలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తీరు కారణంగా చిత్తూరు జిల్లాలో సహకార రంగంలో ఉన్న రెండు చక్కర ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. అదేవిధంగా చిత్తూరు పాలడైరీని కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు మూసివేయించారని, తన హెరిటేజ్ పాల ఫ్యాక్టరీకి లాభాల కోసం చిత్తూరు డైరీని పద్ధతి ప్రకారం మూతపడేలా చేశారని ధ్వజమెత్తారు. రైతుల జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు పెట్టుకున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్ జగన్‌కు నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు..! ‘పొద్దుటి నుంచి ఇవాళ ఎండను ఖాతరుచేయకుండా, నడిరోడ్డును ఖాతరు చేయకుండా వేలమంది నాతోపాటు అడుగులో అడుగు వేశారు. ఒకవైపు కష్టాలూ, బాధలూ నాతో చెప్పుకుంటూనే మరోవైపు నన్ను భుజం తట్టి అండగా నిలిచి తోడుగా నడిచారు. చెరగని చిరునవ్వుతో ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, ఆత్మీయతలు చూపుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని వైస్ జగన్ అన్నారు. చక్కర ఫ్యాక్టరీలు మూతబడే పరిస్థితి..! 'ఇవాళ పూతలపట్టు నియోజకవర్గానికి పక్కనే చిత్తూరు చక్కర ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆరు చక్కర ఫ్యాక్టరీలు ఉండగా.. చిత్తూరు, రేణిగుంట చక్కర ఫ్యాక్టరీలు సహకార రంగంలో ఉన్నాయి. మిగతా నాలుగు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా.. సహకార రంగంలో ఉన్న చక్కర ఫ్యాక్టరీలు మూతబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రైవేటు రంగంలోని ఫ్యాక్టరీలు మాత్రం లాభాల్లో నడుస్తున్నాయి. నిజానికి సహకార రంగంలోని చక్కర ఫ్యాక్టరీలు నడిచేలా ముఖ్యమంత్రి చూడాలి. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు ఇవి కృషి చేస్తాయి. అప్పుడు ప్రైవేటు ఫ్యాక్టరీలు కూడా పోటీపడి.. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రయత్నిస్తాయి. కానీ చంద్రబాబు తన సొంత జిల్లాకు చెందిన రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతపడేలా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ రెండు చక్కర ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో సహకార రంగంలోని చక్కర ఫ్యాక్టరీలకు బకాయిలు చెల్లించి మళ్లీ తెరిపించారు. ఆ ఫ్యాక్టరీలు పదేళ్లు నడిచాయి. రైతులకు లాభం చేకూరింది. కానీ చంద్రబాబు సీఎం కాగానే రెండు చక్కర ఫ్యాక్టరీలు మూతబడే పరిస్థితుల నెలకొన్నాయి. ఒకవైపు రైతులు పంటలు పండించడానికి పంట పండించడానికి పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది. మరోవైపు సహకార రంగంలోని ఫ్యాక్టరీలు మూతబడుతుండటంతో గిట్టుబాటు ధర అందక రైతులు చివరకు చెరకు పంటకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది. రైతులకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రైవేటు చక్కర ఫ్యాక్టరీలకు పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు బెల్లం చేసుకొని ఎక్కువ లాభాలు తెచ్చుకోవాలని భావిస్తున్నా చంద్రబాబు సర్కారు అడ్డుపడుతోంది. నల్లబెల్లం అంటూ రైతన్నలను నాశనం చేసే కార్యక్రమం పెట్టుకుంది. భూమిని బట్టి నల్లబెల్లం లేదా తెల్లబెల్లం పండుతుందన్న విషయం ఈ చంద్రబాబుకు తెలియదా? రైతులు బెల్లం తయారుచేసుకొని లాభాల పొందకుండా సీఎం అడ్డుపడుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. చిత్తూరు డైరీ.. పద్ధతిప్రకారం మూసివేశారు! సీఎం చంద్రబాబు రైతులకు తోడు ఉండాల్సిందిపోయి.. తన సొంత కంపెనీ హెరిటేజ్ ఫ్యాక్టరీకి లాభాల కోసం చిత్తూరు డైరీని ఓ పద్ధతి ప్రకారం మూసివేయించారని వైఎస్ జగన్ ఆరోపించారు. చిత్తూరు డైరీ పాలకమండలిలో తనకు కావాల్సిన వ్యక్తులు నియమించుకొని.. ఒక పద్ధతి ప్రకారం డైరీకి పాలు పోసే రైతులకు పేమెంట్లు ఆపేశాడని, దీంతో గత్యంతరం లేకు హెరిటేజ్ డైరీకి రైతులు పాలు అమ్మడం మొదలుపెట్టారని వివరించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ కోసమే దుర్భుద్ధితో చంద్రబాబు దగ్గర ఉండి చిత్తూరు డైరీని మూసేసే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. తనకు ఓట్లేయకపోతే ప్రజలే సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారు నాలుగేళ్లలో ఏం చేశారని చంద్రబాబుకు ఓట్లేయాలి చంద్రబాబు పాలన అంతా మోసం, అవినీతి, అబద్ధం మాత్రమే పైస్థాయిలో చంద్రబాబు దోచుకుంటుండగా.. కిందిస్థాయిలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుంటున్నాయి విద్యుత్, ఆర్టీసీ చార్జీలను మూడుసార్లు పెంచారు ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పెట్రోల్ ధరలు పెరిగాయి తమిళనాడులో మనకంటే రూ. 7 తక్కువగా పెట్రోల్ దరల ఉండగా.. కర్ణాటకలో రూ. ఐదున్నర తక్కువగా ఉన్నాయి పేదలకు మేలు చేసిన ఘనత వైఎస్సార్‌దే పేదలు ఉన్నత చదువులు చదవాలని వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు ఈ పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు నీరుగారుస్తున్నారు రూ. లక్ష వరకు ఫీజులు ఉండగా.. చంద్రబాబు రూ. 30వేలే చెల్లిస్తున్నారు అది కూడా ఏడాదిన్నరగా రావడం లేదు మనం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తాం విద్యార్థుల ఖర్చుల కోసం ఏటా రూ. 20వేల చొప్పున చెల్లిస్తాం పిల్లలను బడులకు పంపితే ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం అవ్వా, తాలకు నెలకు రూ. 2వేల చొప్పున పింఛన్ ఇస్తాం పింఛన్ వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే రూ. 2వేల చొప్పున పెన్షన్ అందిస్తాం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం.. అక్కాచెల్లెమ్మల పేరిట ఆ ఇళ్లను రిజిస్టర్ చేయిస్తాం ఎన్నికలనాటికి ఎంత మొత్తం రుణం ఉంటే.. అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా డ్వాక్రా మహిళలకే చెల్లిస్తాం -
జిల్లాలో భూ కబ్జాల పర్వం
– రెవెన్యూ అధికారుల సాయంతో అక్రమాలు – తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్ – ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు – అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లకే అధికారుల పెద్దపీట – రిజిస్టర్ డాక్యుమెంట్లకు విలువివ్వని వైనం చిత్తూరు(కలెక్టరేట్): జిల్లాలో కబ్జాదారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ, మఠం భూములన్న తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమించేస్తున్నారు. అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్ల సాయంతో వెబ్‌ల్యాండ్‌లో వివరాలు నమోదు చేసుకుని బ్యాంకుల నుంచి అడ్డదిడ్డంగా రుణాలు పొందడమేకాకుండా, భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులు రిజిస్టర్ డాక్యుమెంట్లను చూపిస్తున్నా రెవెన్యూ అధికారులు కబ్జాదారులకే వంతపాడుతుండడం గమనార్హం. జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇదిగో సాక్ష్యం.. – పులిచెర్ల మండలం దేవళంపేట గ్రామలెక్కల దాఖలా సర్వే నెం. 125 లోని 7.96 ఎకరాల స్థలం 1954 ముందు మూడు కుంటల సముదాయం. అదేగాక సర్వే నెం. 128–10 లోని జమీందారుల ఆధీనంలోని పాళ్యంకట్టుబడి భూములు, దేవాదాయ భూములను అప్పటి కరణం బంజరు భూములుగా మార్పు చేశారు. సర్వే నెం. 146–11 లో 18 సెంట్ల శ్మశాన స్థలంతో పాటు, హంద్రీ నీవా కాలువ గట్టు భూములను కూడా ఇటీవల ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. సర్వే నెం. 296–4 లోని 1.96 ఎకరాల విస్తీర్ణం ఉన్న గంగమ్మ చెరువు గత మూడేళ్ల క్రితం కూడా ప్రభుత్వ లెక్కల్లో చెరువుగానే ఉంది. అయితే ప్రస్తుతం ఓ వ్యక్తి ఆధీనంలో పూర్తిగా సాగులో ఉంది. వీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు సాక్షికి తెలియజేశారు. – పూతలపట్టు మండలం అయ్యప్పగారి పల్లెకు చెందిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా 10 మంది రైతులకు చెందిన 67 సర్వే నంబర్ల పరిధిలోని దాదాపు 17.50 ఎకరాల స్థలానికి తప్పుడు రికార్డులు సృష్టించి ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు. అదేగాక వెబ్‌ల్యాండ్‌లోని 1 (బీ) ఆధారంగా ఏకంగా ఆ భూములను పక్కాగా రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఆ భూమలు గ్రామస్తుల అనుభవంలోనే ఉన్నాయి, కానీ రికార్డులు మాత్రం ఇతనిపై ఉన్నాయి. అంతటితో ఆగని కబ్జాదారు రికార్డుల ప్రకారం భూములను స్వాధీనం చేసుకునేందుకు సర్వేకు సన్నద్ధమయ్యాడు. దీంతో విషయం తెలుకున్న గ్రామస్తులు లబోదిబోమంటూ గత నెల 25 తేదీ కలెక్టరేట్‌కు విచ్చేసి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ లీలలు గతంలో భూములకు సంబంధించి కొనుగోలు, విక్రయాలను రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా చేసేవారు. ఫలితంగా రిజిస్ట్రేష్లలో అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదు. అయితే రైతులు తమ భూముల ఆధారంగా బ్యాంకు రుణాలు పొందాలంటే డాక్యుమెంట్లను తాకట్టు పెట్టేవారు. ఈ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రభుత్వం భావించింది. రికార్డుల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ అధికారుల ద్వారా పొంది, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందే సౌలభ్యాన్ని కల్పించారు. దీంతో కొందరు స్వార్థపరులు రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కుమ్మక్కై ఇతరుల భూముల సర్వే నంబర్లతో అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి, వాటి ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొంది బ్యాంకు రుణాలు పొందారు. తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్ ప్రస్తుత ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా ఆన్లైన్లోని వె»Œ ల్యాండ్ రికార్డులను పక్కా చేసే పనులు ముమ్మరం చేస్తోంది. దీంతో గతంలో అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లతో పట్టాదారు పుస్తకాలు పొంది, ఆన్లైన్లోని 1(బీ)లో సర్వే నెంబర్లను నమోదు చేసుకున్న వారు అధికంగా ఉన్నారు. దీనికారణంగా భూముల యజమానులు ఒకరైతే, వెబ్‌ల్యాండ్‌లో నకిలీ పత్రాలు, పట్టాదారు పుస్తకం కల్గిన వారు యజమానులుగా మారుతున్నారు. దీంతో పక్కాగా రిజిస్టర్ డాక్యుమెంట్లు కల్గిన భూస్వాములు వెళ్లి తమ రికార్డులు చూపినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. గుడ్డిగా రిజిస్ట్రేషన్లు రికార్డులు పక్కాగా ఉన్నా, అన్‌లైన్‌లోని 1 (బీ)లో స్వార్థపరుల పేరున ఉండే సర్వే నంబర్లను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు అనేక నిబంధనలు చెబుతున్నారు. నకిలీ పట్టాదారు పుస్తకమయినా, ఆ పుస్తకాన్ని రద్దుచేసే, 1 (బీ)లో నంబర్లను తొలగించే అర్హత తహశీల్దార్లకు లేదని, ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవాలని తెలుపుతున్నారు. భూస్వామి రికార్డుల ప్రకారం ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా, వాటికి సంబంధించిన సర్వే నంబర్లను 1 (బీ)లో కనీసం బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టడం లేదు. దీనికారణంగా భూస్వామి ఫిర్యాదు చేసినా ఆక్రమ రికార్డు దారులు ఆ భూములను వెబ్‌ల్యాండ్ ఆధారంగా ఇతరులకు విక్రయించుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. దీంతో అసలు యజమాని ఆ భూములపై పట్టుకోల్పోవాల్సి వస్తోంది. ఆఖరుకు వ్యవహారం కోర్టుకు వెళ్లడం, వాటిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తరువాతనే రెవెన్యూ అధికారులు 1 (బీ)లో అసలు యజమానికి మార్పు చేస్తున్నారు. ఈ తతంగం అంతా పూర్తి చేసుకోవాలంటే భూస్వామికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు మా గ్రామ పరిధిలోని భూములకు తప్పుడు రికార్డులతో కొందరు పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించుకుని ఆన్లైన్ 1 (బీ)లో నమోదు చేసుకున్నారు. ఏకంగా చెరువు, శ్మశాన స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారు. దీనిపై గ్రామస్తులందరు కలిసి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – వెంకటరమణ, దేవళంపేట – పులిచెర్ల మండలం -
మావాడిని చిరంజీవిని చేయండి
ఓ నిస్సహాయుడి తల్లిదండ్రుల మొర కారుణ్యమరణానికి అనుమతించాలని వేడుకోలు తీవ్ర అనారోగ్యంతో అచేతనంగా కొడుకు ఏమీ చేయలేమన్న వైద్యులు అవయవదానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు పూతలపట్టు: చలనంలేని బిడ్డను కళ్లముందు చూడలేక ఆ తల్లిదండ్రులు తమలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ దు:ఖాన్ని దిగమింగుకుంటున్నారు. లక్షలు వెచ్చించినా బతకడని వైద్యులు తేల్చేయడంతో తమ బిడ్డను మరొకరిలో చూసుకోవాలని ఆ పేద తల్లితండ్రులు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గోపాలక్రిష్ణాపురానికి చెందిన ఉమాపతి, కవితల మొదటి సంతానం నిరంజన్. తొమ్మిదేళ్ల్ల వయసులోనే ఈ బిడ్డకు తల భాగం పెద్దది కావడంతో స్విమ్స్‌కు తీసుకువచ్చారు. హైడ్రోసిఫాలెస్ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్‌కు పది లక్షలు ఖర్చుఅవుతుందన్నారు. ఆ పేద దంపతులు ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి బెంగళూరులోని నిమ్హాన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు. కొన్నాళ్లు బాగున్నా సమస్య పునరావృతమైంది. దీంతో మళ్లీ ఆపరేషన్ చేశారు. అయినా వ్యాధి ముదిరిపోయింది. వారం రోజుల క్రితం మరోసారి బెంగళూరులోని రామయ్య హాస్పిటల్లో చేసిన ఆపరేషన్ కూడా ఫలించలేదు. ఆక్సిజన్ ఉన్నంత సేపు నిరంజన్ బతికుంటాడని.. తీస్తే చనిపోతాడని వైద్యులు తేల్చి చెప్పారు. చేసేదిలేక ఉమాపతి దంపతులు తమ బిడ్డను ఇంటికి తీసుకొచ్చేశారు. బిడ్డ అచేతనంగా పడి ఉండటాన్ని చూసి తల్లితండ్రులు క్షణక్షణం తల్లడిల్లిపోతున్నారు. నిరంజన్ అవయవాలు దానం చేసి మరికొందరిలోనైనా బిడ్డను చూసుకుంటామనే భావనకు వచ్చేశారు. సత్వరమే. కారుణ్య మరణానికి అనుమతించాలని అభ్యర్థిస్తున్నారు. బిడ్డ ప్రాణం పోయేలోగా అవయవదానంతో మరొకరి ప్రాణాన్ని నిలపాలనే తమ కాంక్ష నెరవేర్చాలని నిరంజన్ తల్లితండ్రులు (9490250874) కోరుతున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలి సాధారణంగా అనారోగ్య కేసుల్లో అవయవదానానికి చట్టం సమ్మతించదు. బ్రెయిన్ డెడ్.. క్లినికల్లీ డెత్ లాంటి సందర్భాల్లోనే ఇది వీలుపడుతుంది. తొలుత బాధితుని తల్లితండ్రులు కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వస్తేనే అవయవదానం సాథ్యమమవుతుంది. దేశంలో అనారోగ్యం బారిన పడి మృత్యువు అంచున ఉన్నవారెందరో అవయవదానానికి సిద్ధంగా ఉన్నా చట్టపరంగా అనుమతి లేదు. - గూడూరి సీతామహాలక్ష్మి, అఖిల భారత అవయవ దాతల సంఘం -
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్సీపీ
చిత్తూరు: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌పై దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఆదివారమిక్కడ నాయకులు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోలీస్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొడుకొస్తాడని.. ఏడాదిన్నరగా ఎదురుచూపు
ఏడాదిన్నరగా వృద్ధ దంపతుల ఎదురుచూపు - రైలుబండి కూతవేస్తే బిడ్డ వస్తున్నాడేమో అని ఆశ - దర్యాప్తు చేసి వదిలేసిన పోలీసులు పూతలపట్టు: రైలు కూతేస్తే చాలు ఇంటి ముందుకొచ్చి నిలుచుకొని తమ బిడ్డ ఆ బండిలో వస్తాడేమో అని ఆ వృద్ధ దంపతులు ప్రతిరోజూ ఎదురుచూస్తున్నారు. కన్న కొడుకు ఉద్దరిస్తాడని స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉద్యోగంలో చేర్పిం చాడు. ఒక్కనెల జీతం డబ్బులు కూడా ఆ తల్లిదండ్రులకు చూపించకుండానే పుత్రశోకం మిగిల్చి ఎటో వెళ్లిపోయాడు. బిడ్డ ఆచూకీ కోసం తిరగని ప్రదేశం లేదు. మొక్కని దేవుళ్లు లేరు. నిత్యం కొడుకుకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తునే ఉన్నారు. పూతలపట్టు మండలం యం.బండపల్లె గ్రామానికి సమీపాన రైలురోడ్డు పక్కన నివాసముంటున్న వజ్రవేలు, నారాయణమ్మ మూడో కొడుకు విజయ్ ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. వజ్రవేలు రైల్వేలో గేట్‌మన్‌గా పనిచేస్తుండేవాడు. గత ఏడాది 2013 జనవరిలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. కుమారుడు విజయ్‌ని రైల్వేలో గేట్‌మన్‌గా చేర్పించాడు. విజయ్ మూడు నెలల పాటు వావిల్‌తోట, ముత్తిరేవుల ఇంటర్లింగ్ లాక్ సిస్టమ్ రైల్వేగేట్లలో గేట్‌మన్‌గా పనిచేశాడు. తరువాత గుంతకల్లు దక్షణమధ్య రైల్వే స్టేషన్‌లోని శిక్షణ సంస్థలో మేనెలలో శిక్షణ పూర్తయిన వెంటనే 27వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అప్లికేషన్ ఇచ్చివస్తానని వెళ్లి.. మే 31వ తేదీన గుంతకల్లులో అప్లికేషన్ ఇచ్చి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి విజయ్ బయలుదేరాడు. ఆ తరువాత ఇంటికి రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగింది. నెలరోజులు గడిచిన తరువాత వారు పూతలపట్టు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కొడు కు తమ కనబడలేదని ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో తేలింది ఇదే.. కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్ ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించా రు. విజయ్‌కి ఫేస్బుక్ టచ్ ఉండడంతో ఫేస్‌బుక్‌ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయితో స్నేహం ఏర్పరుచుకున్నాడు. హైదరాబాద్‌కు వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడి తిరిగి ఇంటికి వస్తుం డగా రైలు వరంగల్లుకు చేరుకోవడంతో విజయ్ మళ్లీ ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం విజయ్ మొ బైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎస్ఐ ముందుగా విజయ్ ఎవరెవరికి ఫోన్‌చేశాడు, అతని ఇన్కమింగ్, ఔట్గోయిం గ్ కాల్స్‌ను పరిశీలించారు. ముందుగా తిరుపతిలో విజయ్ ఫోన్ నుంచి యువతి ఎవరికి ఫోన్చేసిందని ఆరా తీశారు. కడప జిల్లాకు చెందిన నాగేశ్వర్ రెడ్డిగా గుర్తించి అతనిని పూతలపట్టు పోలీస్స్టేన్కు పిలిపించారు. విచారణలో అతను విజయ్‌ని ఎప్పుడూ చూడలేదని చెప్పడంతో వదిలేశారు. ఆ తర్వాత దర్యాప్తులో పురోగతి లేదు. తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో గత ఏడాది మే 31వ తేదీ తరువాత జూన్ మొదటి వారంలో రూ.2000 డ్రాచేశాడు. ఆతరువాత మిగిలిన 11,700 రూపాయలను ఇప్పటికీ డ్రా చేయలేదు. దీంతో విజయ్ ఏమైనట్లు అన్నది మిస్టరీగా మారింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తేగాని అసలు విషయం బయటపడే అవకాశం లేదు. కన్నకొడుకు కోసం ఆ తల్లిదండ్రులు మాత్రం నిత్యం రైలుబండి వచ్చేటప్పుడల్లా తనకొడుకునే గుర్తు చేసుకుంటూ తీవ్ర వేదనకు గురవుతున్నారు. అయితే విజయ్ గురించి ఇప్పటివరకు రేల్వే సిబ్బంది కూడా పట్టించుకోక పోవడం గమనార్హం. -
బాబు, కిరణ్ దొంగ నాటకాలు ఆడుతున్నారు: వైఎస్ జగన్
-
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం అయ్యవారిపల్లెలో మంగళవారం తెల్లవారుజామున కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని విశాఖ నగరంలోని కింగ్ జార్జీ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మినీ బస్సు బోల్తా పడింది. ఆ మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధితులంతా హైదరాబాద్ వాసులే.