
సాక్షి, చిత్తూరు: రోడ్డుపై వెళ్తుండగా అనూహ్యంగా కారులో మంటలు చెలరేగిన ఘటన ఆరో జాతీయ రహదారిపై పూతలపట్టు మండలంలోని వజ్జి రెడ్డిపల్లి వద్ద చోటుచేసుకుంది. కే.ఎన్.ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న రాజేష్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి కాణిపాకంలో పూజకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. కష్టపడి కొనుక్కున్న కారు మంటలకు ఆహుతైందని రాజేష్ వాపోయాడు. (స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం)