పత్తా లేకుండా పోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..! | Puthalapattu TDP MLA Therlam Poornam Unwilling To Contest | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి..!

Published Thu, Mar 21 2019 9:12 AM | Last Updated on Thu, Mar 21 2019 10:09 AM

Puthalapattu TDP MLA Therlam Poornam Unwilling To Contest - Sakshi

సాక్షి, చిత్తూరు : టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కొందరు టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. పూతల పట్టు నియోజనవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. టికెట్‌ కేటాయించి 36 గంటలైనా గడవకముందే పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. తనకు టికెట్‌ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితమే ఐవీఆర్‌ఎస్‌ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని అతను వెల్లడించినట్టు సమాచారం. పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్‌ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో లలితకుమారి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సోమవారం రాత్రి ఆమెకు ఒక్కసారిగా షాక్‌ తగిలింది. టీడీపీ విడుదల చేసిన తుది జాబితాలో పూతలపట్టు టికెట్‌ను పూర్ణం అనే కొత్త వ్యక్తికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ స్థానం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంఎస్‌ బాబు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement