సాక్షి, చిత్తూరు జిల్లా: ఒకటో తేదీన సూర్యుడు ఉదయించముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారని, అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా శాడిస్టా అనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన పూతలపట్టు బహిరంగ సభలో మాట్లాడుతూ, చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా? అంటూ ప్రశ్నించారు.
పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
►ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి.
►జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు
►ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది
►ఈ యుద్ధంలో నేను ప్రజలపక్షాన ఉన్నా
►అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్ గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు
►ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు
►ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.
►ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే
►జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
►పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?
►ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంది
►చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?
►చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?
►వార్డు, సచివాలయాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్
►రైతు భరోసా కేంద్రాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్
►ప్రభుత్వ బడులను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్
►విలేజ్ క్లినిక్‌లను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్
►వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది ఎవరంటే.. మీ జగన్
►మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్.
►మే 13న జరగబోయే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి
►పేదలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలను రక్షించేందుకు సిద్ధమా?
►రూ.3వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
►రైతు భరోసాకు రైతన్నలకు అండగా నిలబడ్డాం
►రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం
►130 సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం
♦14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు
♦2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. చేశాడా?
♦డ్వాక్రా రుణమాఫి అన్నాడు.. ఒక్క రూపాయి అయినా చేశాడా?
♦ఆడబిడ్డ పుడితే 25 వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా?
♦ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా?
Comments
Please login to add a commentAdd a comment