అమెరికాలో కత్తిపోట్లు.. | Four killed, 2 injured in stabbing spree in California | Sakshi
Sakshi News home page

అమెరికాలో కత్తిపోట్లు..

Published Fri, Aug 9 2019 3:30 AM | Last Updated on Fri, Aug 9 2019 3:30 AM

Four killed, 2 injured in stabbing spree in California - Sakshi

లాస్‌ఏంజెలిస్‌: దోచుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోయిన ఓ వ్యక్తి యథేచ్ఛగా కత్తిపోట్లకు పాల్పడటంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మాన్‌గ్రోవ్‌ సిటీలో జరిగింది. సిటీకి చెందిన ఓ వ్యక్తి(33) మొదటగా తన అపార్టుమెంట్‌లోని ఓ దుకాణదారును కత్తి చూపి బెదిరించి, దోచుకున్నాడు. ఆపైన ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి అతని వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నాడు. ఈ ఘటనలో ఆ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కత్తి, తుపాకీ చూపి బెదిరిస్తూ సుమారు ఆరు దుకాణాల్లో నగదు దోచుకున్నాడు. మొత్తం ఆరుగురిని గాయపరచగా నలుగురు మృతి చెందారు. రెండు గంటలపాటు చెలరేగి పోయిన అతడిని పక్కనే ఉన్న సాంటాఅనా సిటీలో పోలీసు డిటెక్టివ్‌లు పట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement